మరో సినిమాకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్... కానీ ఒక కండీషన్!
'గీత గోవిందం' సినిమాతో తన కెరీర్లోనే అతిపెద్ద విజయం నమోదు చేయడంతో పాటు... మీడియం రేంజి సినిమాకు భారీ బడ్జెట్ స్థాయి లాభాలు తెచ్చిన దర్శకుడిగా పరశురాం పేరు తెచ్చుకున్నాడు. ఈ విజయం అతడి రేంజి మరింత పెంచింది. టాలీవుడ్ టాప్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కింది.
ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.... పరశురాంతో సినిమా చేయడానికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొరటాల శివ ద్వారా సూపర్ స్టార్‌ను కలిసి తన వద్ద ఉన్న స్క్రిప్ట్ వినిపించారని, తొలి సిట్టింగులో మహేష్ బాబు ఇంప్రెస్ అయ్యాడని టాక్.

పరశురాం తన తర్వాతి సినిమా గీతా ఆర్ట్స్ బేనర్లో కమిట్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ ఆ సంస్థలోనే నిర్మించాలనే ప్రపోజల్ తెచ్చాడట. అయితే మహేష్ బాబు మాత్రం... ఇందులో దిల్ రాజు సైతం ఉండాల్సిందే అని షరతు పెట్టాడట. ప్రస్తుతం మహేష్ బాబు, దిల్ రాజు 'మహర్షి' ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే పరశురాంతో చేయబోయే సినిమా విషయంలో ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.
మహేష్ బాబు తన 26వ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత 27వ చిత్రంగా పరశురాంతో సినిమా ఉండే అవకాశం ఉంది.
కాగా.. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'మహర్షి' బాక్సాఫీస్ వద్ద నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొడుతూ దూసుకెళుతోంది. బుధవారంతో తొలి వారం పూర్తి చేసుకున్న ఈచిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 59.37 కోట్ల షేర్ వసూలు చేసింది


Click it and Unblock the Notifications











