21 రోజుల లాక్ డౌన్.. సితార ఫీలింగ్ ఎలా ఉందంటే..?
కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా గజగజవణుకుతోంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకగా.. వేలమంది ప్రాణాలను కోల్పోయారు. మన దేశంలోనూ ఇప్పటికే దాదాపు 600 మంది కరోనా బారినపడ్డట్టు తెలుస్తోంది. ఈ వైరస్‌కు విరుగుడును ఇంకా కనిపెట్టలేకపోవడంతో మానవాళి భయంతో వణికిపోతోంది. ఈ వైరస్ ధాటికి బెదిరిపోతోన్న చాలా దేశాలు ఇప్పటికే లాక్ డౌన్‌ను ప్రకటించాయి.
భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం దేశం మొత్తం లాక్ డౌన్‌ను ప్రకటించాడు. రానున్న 21 రోజులు దేశం మొత్తం మూత పడిపోతుందని పేర్కొన్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని సెలెబ్రిటీలు, సామాన్య జనం అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సమర్థించారు. 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండని సూచిస్తున్నారు. ఈ క్రమంలో నమ్రతా శిరోద్కర్ ఓ పోస్ట్ చేసింది.

మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎంత సమయాన్ని కేటాయిస్తాడో అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా మధ్యలో టైమ్ వెచ్చించి మరీ కుటుంబాన్ని విదేశాలకు తీసుకెళ్తుంటాడు. అక్కడ సితార, గౌతమ్ చేసే అల్లరి గురించి నమ్రత నిత్యం సోషల్ మీడియాలో చెబుతూనే ఉంటుంది. ముఖ్యంగా సితార నాన్న కూచి అన్న సంగతి తెలిసిందే. ఇక 21 రోజులు లాక్ డౌన్ తెలియడంతోనే సితార చాలా హ్యాపీగా ఫీలైనట్టు నమ్రత పేర్కొంది. ఈ మేరకు పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం ప్రారంభమే..ఆమె నాన్న చేతుల నుంచి ఇక రాదు.. కరోనా సమయంలో జీవితం ఇలా గడిచిపోతుంది.. ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి అని పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











