ఆమె మాత్రమే మహేష్‌ను అలా చేయగలదు.. పిల్లాడిలా మారిపోయిన సూపర్ స్టార్.. వీడియో వైరల్
లాక్ డౌన్ సమయాన్ని అందరి హీరోలకంటే మహేష్ బాబు కాస్త ఎక్కువగా వినియోగించుకుంటున్నట్టు కనిపిస్తోంది. సినిమాలున్నా, ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మహేష్ బాబు.. ఈ లాక్ డౌన్‌ను పూర్తిగా కుటుంబానికే అంకితమిచ్చినట్టు కనిపిస్తోంది. సితార, గౌతమ్‌లతో కలిసి తెగ ఆడుకుంటున్నాడు. ఆ ముగ్గురు కలిసి చేసే అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు కిక్కిస్తుంది నమత్ర. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ క్యూట్ వీడియో అందర్నీ కట్టిపడేస్తోంది.
Recommended Video

మెమోరీ థెరపీ..
మెమోరీ థెరపీ పేరిట గతంలోని అందమైన క్షణాలను మళ్లీ అందరికీ గుర్తు చేస్తోంది. ఈ లాక్ డౌన్ పీరియడ్‌లో రోజుకో వీడియో, ఫోటో, ఘటనను చెబుతూ.. మహేష్ బాబు, సితార, గౌతమ్‌ల గురించి ఫ్యాన్స్‌కు తెలిసేలా చేస్తోంది. ఈ మేరకు సితార పాటలు పాడిన వీడియోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే.

నాన్న పాటలను మాత్రమే..
సితార మహేష్ బాబు పాటలకు, సినిమాలకు మాత్రమే కాలు కదుపుతుంది. కేవలం మహేష్ బాబు పాటలను మాత్రమే పాడుతుంది. ఖాళీగా ఉన్నా, కార్లో ఎక్కడికైనా వెళ్తున్నా మహేష్ పాటలను హమ్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య నమ్రత షేర్ చేసిన క్యూట్ వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.

వీడియో గేమ్స్ ఆడుతూ..
ఇక లాక్ డౌన్ సమయాన్ని ఈ ముగ్గురు వీడియో గేమ్‌లతో గడిపేస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ సితార కలిసి గౌతమ్‌ను ఆటపట్టిస్తున్నట్టు ఓ ఫోటోను షేర్ చేసింది. ‘ఆటను గెలవడానికి కొడుకు ప్రయత్నిస్తూ ఉంటే.. కూతురు, తండ్రి మధ్యలో చెడగొడుతూ ఉంటే.. బుద్దిమంతుడైన నా కొడుకు వారిద్దరికి చిరునవ్వుతో లొంగిపోయాడు.. ప్రేమతో ఒకరికొకరు.. మీరు కూడా మీ విషయాలను చెప్పండ'ని మహేష్ చేసే అల్లరిని నమ్రత ఫోటో రూపంలో బయటకు వదిలింది. తాజాగా కూతుర్ని నవ్వించడానికి మహేష్ వెంట్రిక్యూలారిజమ్ చేసేవాడిలా మారిపోయాడు.

ఆమె మాత్రమే అలా..
ఈ మేరకు నమ్రతా వీడియోను షేర్ చేస్తూ.. ‘ప్రేమ, జీవితం, హాస్యం.. మహేష్ బాబు సీతు పాప టెడ్డీతో ఆడుకుంటున్నారు.. మహేష్‌లోని పసితనాన్ని ఆమె మాత్రమే బయటకు తీసుకురాగలద'ని క్యూట్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో టెడ్డీ బియర్ సాయంతో పాట పాడుతూ సితారాను నవ్వించే ప్రయత్నం చేశాడు మహేష్.


Click it and Unblock the Notifications











