మహేష్‌ను అందుకోలేకపోయిన సితార.. వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఫ్యామిలీకి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చే మహేష్ బాబు ఈ విరామ సమయంలో మరింత ఎంజాయ్ చేస్తున్నాడు. సితార, గౌతమ్‌లతో కలిసి చిన్న పిల్లాడిలా మారిపోయాడు. కేవలం ఆటలు, మాటల్లోనే కాదు లుక్స్‌లోనూ మహేష్ మరింత వెనక్కి వెళ్లాడు. గౌతమ్‌కు సోదరుడిలా ఉన్నాడంటూ మహేష్‌ను పొగిడేస్తున్నారు. ఈ లాక్ డౌన్‌లో మహేష్ తన ఫ్యామిలీతో గడిపినంత సరదాగా మరే హీరో గడపలేదేమోనని అనిపిస్తోంది.
మెమోరీ థెరపీ అంటూ గతంలో సితార, మహేష్, గౌతమ్‌ల అల్లరి, వారితో గడిపిన అందమైన క్షణాలను నమత్ర మళ్లీ అందరికీ గుర్తు చేస్తోంది. రోజుకో వీడియో, ఫోటోను షేర్ చేస్తూ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు కిక్కిను ఇస్తోంది. అయితే మరోవైపు సితార కూడా కొన్ని క్యూట్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ మధ్య అమ్మకు సాయం చేయాలని, చీపురు పట్టి ఇంటిని శుభ్రం చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

తాజాగా సితార ఓ క్యూట్ వీడియోను షేర్ చేసింది. తండ్రితో కలిసి స్మిమ్మింగ్ పోటీలోకి దూకింది. అయితే నాన్న చేతులు పెద్దగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా నాన్నతో పోటి అంటే సరదాగానే ఉంటుందని తెలిపింది. ఇక ఈ వీడియోలో మహేష్ విన్ అయినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఇలా ఏదో ఒక రూపంలో మహేష్ బాబును చూస్తూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లడం లేదు.


Click it and Unblock the Notifications











