SSMB29: మహేష్ బాబు మూవీ లాంచ్ డేట్ ఎప్పడంటే?.. రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ కూడా లీక్!
భారతీయ సినిమా పరిశ్రమలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న రూపొందించే సినిమా ఎప్పుడెప్పుడా? అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే గత కొద్దికాలంగా అగో అప్పుడు? ఇగొ ఇప్పడు అనే వార్తలే వినిపిస్తున్నాయే కానీ కార్యరూపం దాల్చలేదు. కానీ రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో వచ్చే SSMB29 మూవీ ప్రారంభం గురించి, రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా రిలీజై దాదాపు అర్ధ సంవత్సరం కావొస్తున్నది. కానీ ఇంకా ఆయన సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకపోవడం ఫ్యాన్స్‌లో ప్రస్టేషన్ పెరిగిపోతున్నది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు.

ఇక RRR సినిమా రిలీజై రెండేళ్లు అయిపోయింది. కానీ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయంపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా మొదలు పెట్టడానికి ఆలస్యమే.. పూర్తి చేయడం కూడా ఆలస్యేమేనా అనే ట్రోల్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి.
ఇక మహేష్ బాబు బాబాయ్, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తాజా ఇంటర్వ్యూలో SSMB28 చిట్టా విప్పేశాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో ఉంది. ఈ మూవీ ఆగస్టులో ప్రారంభం అవుతుంది. ఆ నెలలోనే సెట్స్‌పైకి వెళ్తుంది అని ఆయన క్లారిటీతో చెప్పేశాడు. దాంతో మరో నెలలో మూవీ ప్రారంభం కాబోతున్నదనే ఆనందంలో మునిగిపోయారు.

అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం ఎక్కువ సేపు ఉండనివ్వకుండా ఆదిశేషగిరిరావు మరో బాంంబు పేల్చాడు. ఈ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంటే మహేశ్ బాబు సినిమా రిలీజ్ కావాలంటే.. మరో రెండు సంవత్సరాలు అంటే.. 2026 రావాల్సిందేనా అనే దిగులుపడి పోతున్నారు.
మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చే సినిమాను పీఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. సుమారుగా ఈ సినిమాను 700 కోట్ల రూపాయలతో నిర్మించాలని అంచనా వేశారు. కానీ ఆ బడ్జెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. త్వరలోనే ఈ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











