SSMB28: మహేశ్ ఫ్యాన్స్‌కు సూపర్ సర్‌ప్రైజ్.. ఆ సింబల్‌తో టైటిల్‌పై క్లారిటీ
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిన అతడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహేశ్ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్టును చేస్తున్నాడు.
'అతడు', 'ఖలేజా' వంటి డీసెంట్ మూవీల తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు. అయితే, ఆ తర్వాత దీనికి బ్రేక్ పడింది. ఇక, కొంత గ్యాప్ తర్వాత రెండో షెడ్యూల్‌ను కూడా మొదలెట్టి చిత్ర యూనిట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇటీవలే మహేశ్ బాబు వెకేషన్‌కు వెళ్లి రాగా.. యూనిట్ మాత్రం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇందులోనే సినిమా షూటింగ్‌ను జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది.

క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా నుంచి ఆశించిన రీతిలో అప్‌డేట్లు రావడం లేదు. దీంతో సూపర్ స్టార్ మహేశ్ అభిమానులు సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ దీనిపై స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో 'హేయ్ సూపర్ ఫ్యాన్స్.. SSMB28 కోసం మీ ఉత్సాహాన్ని, నిరీక్షణను అర్థం చేసుకున్నాము. సూపర్ స్టార్ నుంచి వచ్చే మాస్ విందు మీ నిరీక్షణ కంటే విలువైనదని హామీ ఇస్తున్నాము. సరైన సమయంలో అనౌన్స్‌మెంట్ రాబోతుంది. దీనిపై కన్నేసి ఉంచండి' అని పేర్కొంది. అదే సమయంలో ఓ బాణం ఎమోజీని కూడా షేర్ చేసింది. దీంతో శ్రీరామనవమి రోజే టైటిల్ పోస్టర్ వస్తుందని పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.
ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు', 'అమ్మ కోసం' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











