SSMB28: మహేశ్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్.. కొత్త మూవీ టైటిల్ పోస్టర్ డేట్ ఇదే

ఆ మధ్య కొన్ని పరాజయాలతో ఇబ్బందులు పడినా.. ఇటీవల 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుని గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌తో హవా చూపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. హిట్లు మీద హిట్లు ఖాతాలో పడుతుండడంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే మూవీని చేశాడు మహేశ్. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్లను భారీ స్థాయిలో రాబడుతూ దూసుకుపోతోంది.

వాస్తవానికి 'సర్కారు వారి పాట' మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో ప్రాజెక్టును కూడా ప్రకటించేశాడు. ఇది ప్రారంభం అవడానికి చాలా సమయం ఉండడంతో దీని కంటే ముందు మరో సినిమాను చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాను అనౌన్స్ చేశాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో అప్పుడే ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.

Mahesh Babu and Trivikram Movie Title Poster on May 31st

క్రేజీ కాంబినేషన్ కావడంతో మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే సినిమా కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు మాత్రం కొద్ది రోజుల క్రితమే పూర్తయ్యాయి. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఇక, ఇప్పుడు సర్కారు వారి పాట జోష్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. కొద్ది రోజులు ఫారెన్ ట్రిప్ వెళ్లొచ్చిన తర్వాత దీన్ని పట్టాలెక్కిస్తారని అంటున్నారు. అంత వరకూ త్రివిక్రమ్ కాస్టింగ్‌పై దృష్టి సారించబోతున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

దాదాపు పదేళ్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించబోయే ఈ సినిమా అప్‌డేట్ కోసం సూపర్ స్టార్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మే 31వ తేదీన విడుదల చేయబోతున్నారట. ఆరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకునే ఈ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఇక, దీనిపై చిత్ర యూనిట్ మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన చేయబోతుందని కూడా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

'అతడు', 'ఖలేజా' తర్వాత త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో హీరో రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ మూవీకి 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్‌గా మథి, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ థమన్ పని చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X