Guntur Kaaram సీరియస్‌గా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్.. నెట్టింట ట్రోలింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న తాజా సినిమా గుంటూరు కారం గురించి అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవిరి 12వ తేదీన అంటే ఈరోజే థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిందీ చిత్రం. అర్థరాత్రి ఒంటి గంట నుంచే షోలు పడగా.. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డులు పడిపోయాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు జరుగుతున్నాయి. అయితే అభిమానులు, సినీ ప్రియుల రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి నేరుగా హీరో, డైరెక్టర్ లే రంగంలోకి దిగారు.

Mahesh babu And Trivikram Srinivas is Very Serious on While Watching Guntur Kaaram Check Details

అలా అని థియేటర్ల బయట నిల్చొని అక్కడక్కడకూ వెళ్తూ అభిమానులతో మాట్లాడడం చేయలేదు. హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎం.ఎం థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో సూపర్ స్టార్ మహేష్ బాబులు కలిసి సినిమా చూసేందుకు వెళ్లారు. ప్రస్తుతం నెట్టింట ఈ వార్త ఫుల్ వైరల్ అయింది. అలలాగే సనిమా చూస్తుండగానే చాలా మంది మహేష్ బాబుతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ఫొటోలు, వీడియోలు తీశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా వీరి ఫొటోలు, వీడియోలే దర్శనం ఇస్తున్నాయి.

Mahesh babu And Trivikram Srinivas is Very Serious on While Watching Guntur Kaaram Check Details

అయితే అభిమానులను కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ చిల్ అయి సినిమా చూసిన మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ఫొటోలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చాలా మంది వీరిని ట్రోలింగ్ కు గురి చేస్తున్నారు. అలాగే ఫన్నీ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అసలు సినిమా చూసేందుకు వెళ్తే నెటిజెన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు అనిపిస్తోంది కదా.. అదేం లేదండీ.. సినిమా చూస్తున్న సమయంలో మహేష్ బాబుతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చాలా సీరియస్ గా కనిపించారు. ఒక్కసారి కూడా వాళ్లు నవ్వుతూ కనిపించలేదు. దీంతో మీమ్స్, ట్రోలింగ్ జరుగుతోంది.

గుంటూరు కారం సినిమా గురూజీ మార్క్ ను అందుకోలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారు. అలాగే కొందరు సౌండ్ బాలేదని చెబుతున్నారు. ఇదంతా తెలిసి.. తాము చూస్తున్నప్పుడు ఆ తప్పులను గుర్తించడం వల్లే వాళ్లు అలా ఉండి ఉండవచ్చేమో అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. వాళ్లలా ఉండడానికి అసలు కారణం ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇవే కారణాలు అంటూ పెద్ద ఎత్తున విశ్లేషణలు చేస్తున్నారు. వీటిపై హీరో లేదా డైరెక్టర్ స్పందిస్తే తప్ప వీటిని ఆపేలా కనిపించట్లేదు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X