SSMB28: మహేశ్ బాబు కోసం త్రివిక్రమ్ కీలక నిర్ణయం.. హిట్ కొట్టేందుకు బ్లాస్టింగ్ ప్లాన్
హిట్టు మీద హిట్టు కొడుతూ కొంత కాలంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. గతంలో ఎన్నడూ లేనంత జోష్‌లో కనిపిస్తోన్న ఈ స్టార్ హీరో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ కమ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా వరకూ షూట్‌ను పూర్తి చేసుకుంది. అక్టోబర్ వరకూ ఈ మూవీకి సంబంధించిన టాకీ పార్ట్‌ను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు.
పరశురాం తెరకెక్కిస్తోన్న 'సర్కారు వారి పాట' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించబోయే తదుపరి సినిమా గురించి ఎన్నో రకాల చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది డైరెక్టర్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో అసలు మహేశ్ ఎవరితో సినిమా చేస్తాడన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్టార్ హీరో తన 28వ చిత్రాన్ని బడా డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే.

'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జత కట్టాడు మహేశ్ బాబు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మహేశ్‌తో చేసే ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడట. అంతేకాదు, దీనికి డైలాగ్ వెర్షన్‌ను కూడా కంప్లీట్ చేసేశాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలాగే, థమన్ కూడా ఈ చిత్రం కోసం అప్పుడే మూడు నాలుగు పాటలను రెడీ చేసి పెట్టాడని అంటున్నారు. మొత్తం ప్రీ ప్రొడక్షన్‌తో పాటు మరిన్ని పనులు కంప్లీట్ అయ్యాయని తెలిసింది.
మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీన్ని నవంబర్ మొదటి వారం నుంచి షురూ చేయబోతున్నారట. అప్పుడూ పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా హైదరాబాద్‌లో జరపబోతున్నారట. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌కు సంబంధించిన ప్లాన్‌ను కూడా రెడీ చేశారని తెలిసింది. దీని ప్రకారం.. ఈ మూవీ షూటింగ్‌ను భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షురూ చేయబోతున్నారట. అలాగే, ఓ పాటను కూడా షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీలో మహేశ్ బాబు రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. అలాగే, అతడి లుక్ కూడా సరికొత్తగా ఉండబోతుందట. ఇందులో సూపర్ స్టార్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్‌గా మథి, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ థమన్ చేస్తున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











