మహేశ్ బాబు అతడు ఫస్ట్ హీరో ఎవరో తెలుసా? 20 ఏళ్లకు బయటపెట్టిన మురళీ మోహన్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ 'అతడు'. ఈ చిత్రానికి త్రిష హీరోయిన్ గా నటించింది. 2005లో ఈ సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. సోనూ సూద్, సునీల్, ప్రకాష్ రాజ్, నాజర్, కోట శ్రీనివాస్, బ్రహ్మానందం వంటి స్టార్ నటుల పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. 20 ఏళ్ల కిందనే ఈ చిత్రం రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎంఎం వంటి థియేటర్లలో 175 రోజుల ఆడింది. ఇక మళ్లీ రీ రిలీజ్ కూడా కాబోతోంది.
మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ చిత్రం రీరిలీజ్ కు 4కే వెర్షన్ రెడీ అవుతోంది. తెలుగు సినిమా హిస్టరీలోనే ప్రత్యేకమైన స్థానం దక్కించుకున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు నటన ప్రాణం పోసింది. ప్రొఫెషనల్ కిల్లర్ గా టెర్రిఫిక్ పెర్ఫామెన్స్ అందించారు మహేశ్ బాబు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆ సమయంలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. తన సొంత నిర్మాణ సంస్థ జయభేరీ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించి గ్రాండ్ గా విడుదల చేశారు.

అయితే ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా 'అతడు' సినిమా ప్రొడ్యూసర్, టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ మహేశ్ బాబు కాదని వెల్లడించారు. అయితే ఈ సినిమాకు మొదటగా ఉదయ్ కిరణ్ ను హీరోగా అనుకున్నట్టు చెప్పుకొచ్చారు. మొదటి నుంచే ఉదయ్ కిరణ్ ను బాగా దగ్గర చేసే వాడినని, తరుచుగా వచ్చి కలుస్తూ ఉండేవాడని చెప్పారు. అదే సమయంలోనే ఉదయ్ కిరణ్ తో అతడు సినిమా చేయాలని అనుకున్నామని అన్నారు.
కానీ అప్పుడు చిరంజీవి కూతురితో ఉదయ్ కిరణ్ పెళ్లికి సంబంధించిన చర్చలు జరుగుతుండటం, ఆయన సినిమా డేట్స్ అన్నీ వేరే టీమ్ చూడటం వల్ల బిజీ అయ్యారని అన్నారు. దాంతో ఉదయ్ కిరణ్ చేయాల్సిన సినిమాతో మహేశ్ బాబు తో తీసి మంచి విజయాన్ని అందుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక ఉదయ్ కిరణ్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. యూత్, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా, లవర్ బాయ్ ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.
చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి మూడు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని 20స్ ప్రారంభంలో సెన్సేషనల్ హీరోగా మారాడు. ఆ తర్వాత రొమాంటిక్ చిత్రాలతోనూ దుమ్ములేపాడు. బ్రహ్మిణ్ కుటుంబానికి చెందిన ఉదయ్ కుమార్ 11 జనవరి 20014లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 33 ఏళ్లకే ఉదయ్ కుమార్ చనిపోవడం పట్ల ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. చివరిగా 'జై శ్రీరామ్' చిత్రంలో కనిపించారు. ఆయన నటించిన 'చిత్రం చెప్పిన కథ' రిలీజ్ కూడా కాకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











