Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 5 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరంజీవిని రికార్డు బద్దలుకొట్టిన మహేష్ బాబు.. కానీ ప్రభాస్‌తో పెట్టుకోలేక పోయాడుగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో 'సరిలేరు నీకెవ్వరు' అంటూ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ మేరకు ఫ్యాన్స్‌కి ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ ఇస్తూ జోష్ నింపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ విషయంలో చిరంజీవిని దాటేసిన మహేష్ బాబు.. ప్రభాస్‌ని మాత్రం ఢీ కొట్టలేకపోయాడు. ఇంతకీ ఏంటా విషయం? వివరాల్లోకి పోతే..
మహేష్ బాబు జోష్.. సరిలేరు నీకెవ్వరు
సరిలేరు నీకెవ్వరు సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు మహేష్ బాబు. ఈ మేరకు ప్రమోషన్స్ సైతం ఘనంగా చేస్తూ ప్రేక్షకుల చూపు ఏ సినిమా వైపు పడకుండా అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే టీజర్, సాంగ్స్ విడుదల చేసి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న సూపర్ స్టార్.. అదేబాటలో ట్రైలర్ కూడా విడుదల చేశారు.

చిరంజీవి రిమోట్ నొక్కడంతో..
నిన్న (ఆదివారం) జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ చిరంజీవి చేతులమీదుగా రిలీజ్ చేశారు. ఆయన రిమోట్ నొక్కగానే అక్కడి తెరపై, సామజిక మాద్యమాలపై 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ సెన్సేషన్ మొదలైంది. ఈ సెన్సేషన్‌లో చివరకు చిరంజీవి 'సైరా' కొట్టుకుపోయింది కానీ.. ప్రభాస్ 'సాహో' మాత్రం ఏ మాత్రం బెనకలేదు.

ఇదీ పరిస్థితి.. చిరంజీవి, ప్రభాస్
విడుదలై ఫాస్టెస్ట్ 100K లైకులు సాధించిన ట్రైలర్ పరంగా చూస్తే.. 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ రెండో స్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ప్రభాస్ 'సాహో' తన మొదటి స్థానాన్ని స్థిరంగా ఉంచుకుంది. చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' ట్రైలర్ ప్రభంజనాన్ని మాత్రం అలవోకగా అధిగమించింది 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్.

వివరంగా మీ కోసం..
ప్రభాస్ 'సాహో' ట్రైలర్ 27 నిమిషాల్లో 100K లైక్స్ సాధించి ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ 37 నిమిషాల్లో ఆ ఘనత సాధించి రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత మూడో స్థానంలో చిరంజీవి సైరా నరసింహా రెడ్డి (40 నిమిషాలు), ఎన్టీఆర్ అరవింద సమేత (67 నిముషాలు) నాలుగో స్థానంలో ఉంది.

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'
మహేష్ బాబు- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి ముఖ్యపాత్ర పోషించింది. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.