ప్రభాస్‌ని వెనక్కి నెట్టేస్తూ మహేష్ బాబు సరికొత్త రికార్డ్.. మా దగ్గర బేరాల్లేవమ్మా!
సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. తన కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ద్వారా ఫ్యాన్స్‌లో నూతనోత్సాహం నింపుతున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా సృష్టిస్తున్న హంగామా చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్‌తో పాటు లేటెస్ట్‌గా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ సరికొత్త రికార్డ్స్ నమోదు చేస్తోంది. ఆ వివరాలు చూద్దామా..

మహేష్ ఆల్‌టైం రికార్డ్..
వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న మహేష్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోగా కీర్తించబడుతున్నారు. కాబట్టి ఆయన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ క్రమంలో 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ఆన్‌లైన్‌లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. సౌత్‌లో తొలి 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా ఆల్‌టైం రికార్డ్ నమోదు చేసింది.

ప్రభాస్‌ని వెనక్కి నెట్టేస్తూ
గతంలో ప్రభాస్ హీరోగా వచ్చిన 'సాహో' టీజర్.. తొలి 24 గంటల్లో 17 మిలియన్ల వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టేస్తూ ముందుకు దూసుకొచ్చింది 'సరిలేరు నీకెవ్వరు' టీజర్. ఈ టీజర్ తొలి 24 గంటల్లో 18 మిలియన్ల వ్యూస్ రాబట్టి సరికొత్త ఫీట్ అధిగమించింది.

ఎన్నడూ లేని విధంగా.. మొదటి స్థానం మహేష్‌దే
ఇక ఇప్పటిదాకా ఎన్నడూ లేని విధంగా మరో రికార్డును కూడా బ్రేక్ చేసింది 'సరిలేరు నీకెవ్వరు' టీజర్. అత్యంత వేగంగా 20 మిలియన్ల వ్యూస్ రాబట్టిన టీజర్ గా రెకార్డుకెక్కింది. అంతేకాదు యూట్యూబ్ ట్రేండింగ్‌లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
సరిలేరు యూనిట్ సంబరాలు
విడుదలకు ముందే 'సరిలేరు నీకెవ్వరు' సెన్సషన్స్ చూసి తెగ సంబరపడుతోంది చిత్రయూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రికార్డులకు సంబదించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ ''మా దగ్గర బేరాల్లేవమ్మా'' అని డైరెక్ట్‌గా చెప్పేస్తోంది. ఇదంతా చూస్తుంటే ఈ సంక్రాంతి సరిలేరు సంచలనాలు ఊహాతీతం అనిపిస్తోంది.
Recommended Video

మహేష్.. సరిలేరు నీకెవ్వరు
సరిలేరు నీకెవ్వరు సినిమాతోనే లేడీ అమితాబ్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం అభిమానుల్లో మరింత ఆత్రుత నింపింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ బాణీలు కడుతున్నారు. జనవరి 12న భారీ అంచనాల నడుమ 'సరిలేరు నీకెవ్వరు' ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో మహేష్ సరసన క్రేజీ భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











