విజయశాంతికి బర్త్ డే విషెస్ తెలియజేసిన మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖనటి విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం(జూన్ 24)న ఆమె 53వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మహేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విష్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే విజయశాంతిగారు...మరోసారి మీతో కలిసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నాను, మీకు ఈ ఏడాది బాగా సాగాలి' అంటూ విష్ చేశారు.
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జులైలో ప్రారంభం కాబోతోంది. చైల్డ్ ఆర్టిస్టుగా విజయశాంతితో 'కొడుకు దిద్దిన కాపురం' మూవీలో కలిసి పని చేసిన మహేష్ బాబు... చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఆమెతో కలిసి నటించబోతున్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ... '' విజయశాంతి గారు... మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను. 'సరిలేరు మీకెవ్వరు' మూవీ ద్వారా మీ రీ ఎంట్రీ గొప్పగా ఉంటుంది.'' అని ట్వీట్ చేశారు.
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా రూపొందబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు.
విజయశాంతి చివరగా 2006లో వచ్చిన పొలిటికల్ డ్రామా మూవీ 'నాయుడమ్మ'లో కనిపించారు. లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ప్రిపేర్ అవుతున్నారు. రోజూ జిమ్‌కు వెళ్లి వర్కౌట్లు చేస్తున్నారట. ఈ చిత్రంలో ఆమె స్లిమ్ లుక్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.
రీ ఎంట్రీపై విజయశాంతి స్పందిస్తూ.. 'కిలాడి కృష్ణుడు సినిమా ద్వారా సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. 180 సినిమాలు చేశాను. నా రాజకీయ జీవితంలో 13 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ రీ ఎంట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.'' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











