SSMB29 సినిమా షూటింగ్ షూరు.. రాజమౌళి కోసం మహేష్ బాబు ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడా?
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న కోసం యావత్తు సినీ ప్రపంచం ఎంతో ఆత్రుతగా వేచి చూస్తోంది. ఆస్కార్ అవార్డు అందుకున్న RRR మూవీ తర్వాత.. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న సినిమా కావడం, అలాగే 'గుంటూరు కారం' సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎవరు ఊహించని విధంగా నేడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. అయితే.. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడంటూ ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్లో ప్రచారమవుతుంది. ఇంతకీ మహేష్ బాబు బ్రేక్ చేసిన సెంటిమెంట్ ఏంటో మీరు ఓ లూక్కేయండి.
దాదాపు రెండేండ్లుగా వేయిట్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా సినిమా అధికారికంగా లాంఛ్ అయ్యింది. హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి. రాజమౌళి సినిమా ముహూర్తానికి మహేష్ బాబు హాజరయ్యారు. వాస్తవానికి మహేష్ బాబు కి చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. అందులో ఒకటి.. మహేశ్ బాబు ఇలాంటి వేడుకలకు, పూజ కార్యక్రమాలకు , తన సినిమా ఓపెనింగ్స్ కు దూరంగా ఉంటారు. దాదాపు పదిహేనేళ్లుగా మహేశ్ బాబు.. నేరుగా మూవీ సెట్స్ లోకి వెళ్లాడు.

దీంతో అక్కడి వారంతా షాక్ అయ్యారు. మహేష్ బాబు తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసి రాజమౌళి కోసం వచ్చాడని అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ షూటింగ్ ఎప్పుడనేది ఇంకా తెలియ రాలేదు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. సంక్రాంతి తర్వాత మహేష్ బాబు రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనవచ్చని, మూవీ యూనిట్ కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కథానాయకగా బాలీవుడ్ హీరోయిన్ దీపిక చోప్రాను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ప్రతి నాయకుడిగా పృథ్వీరాజ్ కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రస్తుతం మహేష్ బాబు తన సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి రాజమౌళి తన సినిమా కోసం ఎంత పెద్ద యాక్టర్ అయినా తాను చెప్పినట్లు వినాల్సిందే. ఇప్పటికే జక్కన్నతో నటించిన పలువురు స్టార్స్ తమ అభిప్రాయాన్ని చెప్పిన విషయం తెలిసింది. ఒక్క షాట్ కోసం అవసరమైతే 50 టేకులైన తీసుకొని పర్ఫెక్షన్ వచ్చేంతవరకు చేపిస్తూనే ఉంటారు. అందుకే ఆయన ను జక్కన్న గా అభివర్ణిస్తారు. రాజమౌళి ఆర్డర్ ప్రకారం మహేష్ బాబు ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని ఉంటారని టాక్.

ఇదిలా ఉంటే.. ఆఫ్రికా సహా ప్రపంచంలోని పలు దేశాలలో SSMB29 షూటింగ్ జరగబోతుంది. అలాగే ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నికల్ టీం కూడా పని చేయబోతున్నారట. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే పలు లొకేషన్స్ సెలక్ట్ చేశారు రాజమౌళి అండ్ టీమ్.ఈ భారీ బడ్జెట్ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











