twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. మహేష్ బాబు, మెగాస్టార్ ట్వీట్స్

    |

    అగ్ర దేశాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు మతింత ఉగ్రరూపం దాలుస్తోంది. ఇక ఈ వైరస్ ఈసారి ఎవరిని వదలడం లేదు. ఎంతో జాగ్రత్తగా ఉండే వారిని కూడా ఎటాక్ చేస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా కరోనా పాజిటివ్ రావడం అందరిని షాక్ కు గురి చేసింది. ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.

    ప్రసుతం కేసీఆర్ వైద్యుల సమక్షంలోనే తన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని.. ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఇక కేసీఆర్ కు కరోనా వచ్చింది అనగానే చాలా మంది సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కేసిఆర్ గారు, కరోనా వైరస్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. అని వివరణ ఇచ్చారు.

     Mahesh Babu chiranjeevi tweet on CM KCR should recover quickly

    ఇదే తరహాలో మహేష్ బాబు కూడా సీఎం కేసీఆర్ తొందరగా కోలుకోవాలని అన్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా కేసీఆర్ తొందరగా కోలుకోవాలని ఆశించారు. అయితే కరోనా వ్యాప్తి రోజురోజుకు విలయతాండవం చేస్తోంది. రోజుకు వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కూడా పరిస్థితి మరింత భయానకంగా మారింది. స్మశానవాటికల వద్ద కూడా శవాల క్యూ ఉండడం భయాన్ని కలిగిస్తోంది.

    English summary
    Not only in the top countries but also in India the corona second wave is getting more and more intense day by day. The virus is not leaving anyone this time around. Attacking even those who are very careful. Corona positive for Telangana CM KCR also shocked everyone. CS Somesh Kumar officially declared that he got positive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X