సైరాపై కన్నేసిన మహేష్ బాబు.. చిరంజీవి, రత్నవేలు పేరు తీస్తూ!
మెగా అభిమానుల ఎదురు చూపులకు తెర పడింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది. దేశవిదేశాల్లో ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
ఈ కోవలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సైరా నరసింహా రెడ్డి సినిమాపై తన కామెంట్ పోస్ట్ చేశారు. ''తెలుగు సినిమా స్థాయిని తెలియ జేస్తున్నాయి సైరా విజువల్స్. చిరంజీవి పర్‌ఫార్‌మెన్స్ ప్రాణం పోసింది. రత్నవేలు అవుట్ స్టాండింగ్ సినిమాటోగ్రఫీ అందించారు. సూపర్.. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా సైరా నరసింహా రెడ్డి. రామ్ చరణ్‌కి, చిత్రయూనిట్ మొత్తానికి అభినందనలు'' అని పేర్కొన్నారు మహేష్ బాబు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించారు. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానుల సంబరాలు మిన్నంటాయి. మరోవైపు దేశ విదేశాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రికార్డుల దిశగా దూసుకెళ్తోంది సైరా నరసింహా రెడ్డి మూవీ.


Click it and Unblock the Notifications











