ఇలాంటివి చేయడంలో ఆయన్ను మించినోడు లేడు.. మహేష్ బాబు రియాక్షన్
విభిన్న చిత్రాలకు చిరునామా డైరెక్టర్ రవిబాబు. సిల్వర్ స్క్రీన్ పై కనిపించడంలో అయినా, మెగా ఫోన్ పట్టి సినిమా రూపొందించడంలో అయినా రవిబాబు రూటే సపరేటు. సినిమా సినిమాకు తనలోని విలక్షణతను బయటకుతీస్తున్న ఆయనపై తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని కామెంట్స్ చేశారు. ఆ వివరాలేంటో చూద్దామా..

కొంతకాలంగా అదే పని
గత కొంత కాలంగా డిఫరెంట్ జోనర్‌లో సినిమాలు తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ రవిబాబు. ఆ సినిమా హిట్టా, ఫట్టా అనేది లెక్క చేయకుండా తన టాలెంట్ గుర్తిస్తే చాలు అన్నట్లుగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి 'ఆవిరి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఫస్ట్‌లుక్, టీజర్.. ఆ ఇంట్లో దెయ్యం
''అల్లరి, అవును'' లాంటి డిఫెరెంట్ కథాంశాలను తెరకెక్కించిన రవిబాబు ఇటీవల పందిపిల్ల ప్రధాన పాత్రలో `అదిగో` సినిమాను రూపొందించి మిశ్రమ ఫలితం పొందాడు. ఇప్పుడు 'ఆవిరి' రూపంలో ఆ ఇంట్లో దెయ్యం ఉందంటూ మరో డిఫెరెంట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి.

ఆయన్ను మించినోడు లేడంటూ మహేష్ బాబు
అయితే 'ఆవిరి' టీజర్ చూసిన మహేష్ బాబు తన స్పందన తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. హారర్ కథాంశంతో సినిమాలు తీయడంలో రవిబాబును మించినోడు లేడంటూ కితాబిచ్చారు మహేష్. ఇలాంటి జానర్‌లో వచ్చిన సినిమాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని తెలుపుతూ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు చెప్పారు.

దిల్ రాజు సమర్పణలో 'ఆవిరి'
దిల్ రాజు సమర్పణలో ఫ్లయింగ్ ప్రాగ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న 'ఆవిరి' చిత్రానికి రవిబాబు దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. చిత్రంలో రవిబాబుతో పాటు నేహా చౌహాన్, హిమజ, ముక్తార్ ఖాన్ నటించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'
ఇక మహేష్ బాబు విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సందడి చేయనుంది.


Click it and Unblock the Notifications











