రాజమౌళి సినిమాపై మొదటిసారి క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు.. మరో బాహుబలి కాదు.. కానీ..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాడు. సర్కారు వారి పాట బర్త్ డే బ్లాస్టర్ అంటూ కొత్త సినిమా టీజర్ తో సోషల్ మీడియాలో సరి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా విడుదలైన 24గంటల్లో అత్యధిక లైక్స్ అందుకోవడమే కాకుండా భారీ స్థాయిలో వ్యూవ్స్ ను అందుకొని సరికొత్త రికార్డులను నమోదు చేసింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కూడా మరో లెవెల్ కు తీసుకువెళ్లింది. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద క్లిక్కవుతుందని ఇప్పటికే అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది.

ఇక మహేష్ బాబు చేయబోయే ఆ తరువాత సినిమాలు కూడా అంతకుమించి అనేలా ఉంటాయని చెప్పవచ్చు. సర్కారు వారి పాట అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమాతో బిజీ కానున్నాడు. ఆ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ అనంతరం మహేష్ బాబు ఎక్కువగా రాజమౌళి సినిమాతోనే బిజీ కానున్నాడు. రాజమౌళి ఏదైనా ప్రాజెక్టు మొదలు పెడితే ఎప్పుడు పూర్తి చేస్తాడు తెలియదు కాబట్టి మహేష్ బాబు ముందుగానే ఆ స్టార్ దర్శకుడి కోసం బల్క్ డేట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. మధ్యలో ఇలాంటి సినిమాలను పెట్టుకోకూడదని కూడా ఫిక్స్ అయ్యాడట.

Mahesh babu comments on director ss rajamouli project

ఇక రాజమౌళి రెండేళ్లు తీసిన కూడా ఆయనకే పూర్తిస్థాయిలో డేట్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఆ ప్రాజెక్టు గురించి ఒక కామెంట్ చేశాడు. రాజమౌళితో గారితో చేయబోయే సినిమా గురించి ఒక విషయం మాత్రం నేను చెప్పాలని అనుకుంటున్నాను. 'ఆ ప్రాజెక్ట్ అయితే నా సినిమా కెరీర్ లోనే చాలా స్పెషల్ గా ఉండబోతుంది. కానీ అది ఎంతమాత్రం కూడా మరో బాహుబలి లా ఉండదు'.. మహేష్ బాబు ఉ రెండు వాక్యాల్లోనే క్లారిటీగా చెప్పాడు. ఇక సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే అవకాశం ఉన్నట్లు ఇదివరకే చాలా రకాల కథనాలు వెలువడ్డాయి.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అది నిజమేనని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ రాజమౌళికి ఇంకా పూర్తిస్థాయిలో కథను వివరించలేదని, ఆయన ఓకే చేస్తే కానీ ఆ కథ సెట్స్ పైకి రాదని అన్నారు. దర్శకుడు రాజమౌళి RRR ఆ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా అన్ని పనులు కూడా మరికొన్ని రోజుల్లో పూర్తవుతాయి. దర్శకుడు సినిమాలు అనుకున్నట్లుగా దసరాకు రిలీజ్ చేస్తాడా లేదా అనే విషయంలో సరైన క్లారిటీ అయితే లేదు. సినిమాను అయితే తొందరగానే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ ఏడాది చివర్లోనే మహేష్ బాబు సినిమాపై రాజమౌళి స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X