వెంకీమామ' సినిమా చూసిన మహేష్ బాబు.. ఎలా రియాక్ట్ అయ్యాడంటే
వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా 'వెంకీమామ'. హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేశారు.
ప్రేక్షకులకు సరైన వినోదం కావాలంటే 'వెంకీ మామ' సినిమా చూడాల్సిందేనని మహేష్ ట్వీట్ చేశారు. ఈ మేరకు తాను ఈ సినిమాను ఎంతో ఆస్వాదించానని తెలిపారు. భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలు పక్కాగా పండిన సినిమా 'వెంకీ మామ' అని మహేష్ బాబు పేర్కొనడం విశేషం. ఈ మేరకు చిత్ర యూనిట్ మొత్తానికి శుభాభినందనలు తెలిపారు మహేష్.

బాబీ (కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన వెంకీమామ సినిమాలో వెంకటేశ్‌కు సరసన పాయల్ రాజ్‌పుత్ నటించగా.. నాగచైతన్య సరసన రాశీఖన్నా నటించింది. చిత్రంలో అందరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటున్నారు ఈ మామ అల్లుళ్ళు.
మరోవైపు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సంక్రాంతి రేస్ కి రెడీ అవుతున్నారు మహేష్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











