Mahesh Babu ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ముందే కంప్లీట్ చేసుకున్న స్టార్

ఆ మధ్య భారీ డిజాస్టర్లతో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. కొంత కాలంగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లో ఎప్పుడూ లేనంత భీకరమైన ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్ అనే నేను' అనే మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన అతడు.. ఆ వెంటనే వంశీ పైడిపల్లితో 'మహర్షి', ఆ తర్వాత అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు చేసి హ్యాట్రిక్ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం పెట్ల డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న చిత్రమే 'సర్కారు వారి పాట'. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పరార్ అవుతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని సెటైరికల్‌గా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత ఏడాది జనవరిలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి చిత్ర యూనిట్ పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంటూ వచ్చింది. ఇలా ఇప్పటికే చాలా వరకు షూట్‌ను పూర్తి చేసేశారు. ఇంకొంత భాగం అయితే సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది.

'సర్కారు వారి పాట' షూటింగ్ జరుగుతుండగానే ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబు మోకాలికి సంబంధించిన సర్జరీని చేయించుకున్నాడు. ఆ వెంటనే కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో చాలా కాలం పాటు అతడు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ముందుగా మహేశ్ బాబు లేని సన్నివేశాలను పూర్తి చేయాలని భావించి.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ అతడు లేకుండానే జరిపారు. ఇక, ఇటీవలే ఈ స్టార్ హీరో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుసగా షెడ్యూళ్లలో పాల్గొంటూ వచ్చాడు. దీంతో చిత్ర యూనిట్ కూడా చిత్రీకరణను మరింత వేగవంతంగా జరుపుతూ వచ్చింది.

Mahesh Babu Completes Sarkaru Vaari Paata Shoot

తాజా సమాచారం ప్రకారం.. సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా 'సర్కారు వారి పాట' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడట. ప్లాన్ చేసుకున్న దాని ప్రకారమే అతడి పార్ట్‌ను పరశురాం ముందుగా కంప్లీట్ చేశాడని తెలుస్తోంది. టాకీ పార్ట్‌ పూర్తైనా.. ఈ సినిమా మహేశ్ బాబు పాల్గొనాల్సిన ఒక సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. దీన్ని కూడా కొద్ది రోజుల్లోనే చేయబోతున్నారని అంటున్నారు. ఇది కూడా పూర్తైన తర్వాతనే ఈ సూపర్ స్టార్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేయాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మహేశ్ షూట్‌ను పూర్తి చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

క్రేజీ కాంబోలో వస్తున్న 'సర్కారు వారి పాట'లో మహేశ్ బాబు మాస్ రోల్ చేస్తున్నాడు. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X