అభిమాని మరణం.. గుండె పగిలిందంటూ మహేష్ బాబు ఎమోషనల్
హీరోలకు అభిమానులు లోకం. అభిమానులకు హీరోలు దేవుళ్లు. హీరోలకు తమ తమ అభిమానుల మధ్య ఉండే అవినాభావ సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా దక్షిణాదిన హీరోలను దైవ సమానులుగా భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా తమిళ, తెలుగు పరిశ్రమల్లో హీరోలను తమ అభిమానులు మరింతగా ఆరాధిస్తుంటారు. హీరోలు కూడా తమ అభిమానుల పట్ల అంతే ప్రేమను కనబరుస్తుంటారు.
తమ అభిమానులు మరణించినప్పుడు సొంతింటి మనుషులు చనిపోయినట్టుగానే బాధపడుతుంటారు. తాజాగా ఘట్టమనేని అభిమాని మరణం పట్ల మహేష్ బాబు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. నెల్లూరు జిల్లా నటశేఖర కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు దాసరి సురేష్ బాబు గురువారం కన్నుమూశారు. సురేష్ బాబు మరణవార్త తెలిసి మహేష్ బాబు ఎంతో బాధపడ్డాడు. ఈ మేరకు సోషల్ మీడియలో ట్వీట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.

దాసరి సురేష్ బాబు అకాల మరణం గురించి తెలిసి నా గుండెపగిలినంత పనైంది. ఆయన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆయన కుటుంబానికి ప్రేమ, గుండె నిబ్బరం కలగాలని కోరుకుంటున్నాను అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఇక మహేష్ బాబు టీం సైతం స్పందించింది. నెల్లూరు జిల్లా అభిమాన సంఘం ప్రెసిడెంట్ దాసరి సురేష్ బాబు గారు మరణించడం మమ్మల్ని ఎంతగానో బాధపెట్టింది. ఆయన కుటుంబాని మా ప్రగాఢ సానుభూతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











