మహేష్‌కు సితార పాప హెడ్ మసాజ్.. ఎంజాయ్ చేస్తున్న సూపర్‌స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హీరోగా బిగ్ స్క్రీన్ పై ఎంత గొప్పగా కనిపించినా కూడా తన ఇంట్లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడని అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా తన ఫ్యామిలీతో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ కారణంగా మహేష్ ప్రతిరోజు పండగే అన్నట్లుగా గడుపుతున్నారు.

ఫ్యామిలీతో హ్యాపీగా..
మహేష్ బాబు షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీని ఏ మాత్రం మిస్ అవ్వడు. ఫారిన్ షెడ్యూల్ ఉన్నా కూడా కొన్నిసార్లు తన ఫ్యామిలీ మెంబర్స్ ని వెంటపెట్టుకొని వెళుతుంటారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా రోజు ఇంట్లోనే ఉంటున్న మహేష్ కొడుకు కూతురి కోసం మరీంత సమయాన్ని కేటాయించి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తున్నాడు.

సితార పాపతో..
మహేష్ బాబుకి తన గారాల కూతురు సితార అంటే చాలా ఇష్టమని అందరికి తెలిసిన విషయమే. ఇంట్లో అల్లరి క్రిమినల్స్ గా వీరిద్దరికి మంచి పేరుంది. ఇక గౌతమ్ తో కూడా మహేష్ ఒక ఫ్రెండ్ లాగా ఆడుకుంటూ ఉంటున్నాడట. అయితే స్పెషల్ బాండింగ్ మాత్రం సితార పాపతోనే. రోజుకో ఫోటోతో ఇద్దరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

మహేష్ బాబుకు మసాజ్..
సితార పాప రీసెంట్ గా తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మహేష్ తో ఉన్న కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకుంది. అందులో తను మహేష్ బాబు తల పట్టుకొని హెడ్ మసాజ్ చేస్తున్నట్లు.పేర్కొంది. అలాగే నాన్న జుట్టు సాఫ్ట్ గా ఉందంటూ.. నాన్నకు ఇది చాలా బాగా నచ్చిందని చెప్పినట్లు సితార కామెంట్ చేసింది. ఇక వీరి ఫొటోలకి అభిమానుల నుంచి పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి.
Recommended Video

రాజమౌళితో మహేష్..
మహేష్ నెక్స్ట్ సినిమా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో చేయనున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా రాజమౌళితో కూడా మహేష్ మరో సినిమాకు కమిట్ అయినట్లు క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న దర్శకుడు రాజమౌళి ఆ సినిమా అనంతరం మహేష్ ప్రాజెక్టును స్టార్ట్ చేయానున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.


Click it and Unblock the Notifications











