మహేష్ ముద్దుల కూతురు సితార మరో ఘనత.. చిన్న వయసులోనే..
సూపర్‌స్టార్ మహేష్‌బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని మరో ఘనతను సొంతం చేసుకొన్నారు. అతి చిన్నవయసులోనే ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను సాధించిన అమ్మాయిగా సితార రికార్డులకెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ఇన్స్‌టాగ్రామ్‌లో తన స్నేహితురాలు ఆద్యతో కలిసి 'Aadya & Sitara' అనే ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను మేనేజ్ చేస్తున్నారు. అంతేకాకుండా యూట్యూబ్ అకౌంట్ కూడా ఉండటం గమనార్హం.
తాజాగా ఏప్రిల్ 11వ తేదీన సొంతంగా పర్సనల్ ఇన్స్‌టాగ్రామ్ పేజ్‌ను ఆరంభించింది. ఫస్ట్ ఫోటోగా తన బెస్ట్ ఫ్రెండ్ ఆద్యతో కలిసి దిగిన సెల్ఫీని పోస్టు చేసింది. ఎప్పటికీ మా ఇద్దరిది విడదీయలేని స్నేహం. బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్ అంటూ పోస్టు పెట్టారు.

ఇక రెండో పోస్టులో తాను మెడిటేషన్ చేస్తుండగా తీసిన ఫోటోను తన ఇన్స్‌టాలో షేర్ చేశారు. అంతేకాకుండా ఆసక్తికరమైన పోస్టును పెట్టారు. మా అమ్మ ప్రతీ రోజు 5 నిమిషాలు కళ్లు మూసుకోమని చెప్పింది. కానీ ఆ సమయంలో ఐసీక్రీమ్‌ల గురించి, ఇంద్ర ధనుసు గురించి ఆలోచిస్తాను అంటూ చిలిపిగా పోస్టును పెట్టింది.
ఇక మూడో ఫోటోగా తనకు ఇష్టమైన టెడ్డీ బేర్‌తో దిగిన ఫోటోను పోస్టు చేసింది. జస్ట్ చిల్లింగ్ విత్ టెడ్డీ అంటూ కామెంట్ పెట్టింది.
గతేడాది సితార సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హాలీవుడ్ చిత్రం ఫ్రొజెన్ 2 చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పడం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. బాల్యంలో ఎల్సా క్యారెక్టర్‌కు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం.


Click it and Unblock the Notifications











