‘నువ్వు ఊహించలేవు నాన్న’.. మహేశ్ బాబు కూతురు ఎమోషనల్ పోస్ట్
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. మహేశ్ బాబు అభిమానులు ఆయన కోసం ఏదైనా చేసేస్తామనే రేంజ్ లో ఉంటారు. ఇక సూపర్ స్టార్ అభిమానులు మహేశ్ బాబు కుటుంబ సభ్యులను కూడా ఎంతో గౌరవిస్తారు. అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో మహేశ్ బాబు ఫ్యాన్స్ కోసం అటు భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితార ఘట్టమనేని కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను అందిస్తూ ఉంటారు. ప్రస్తుతం మహేశ్ బాబు కుటుంబంతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మహేశ్ బాబు ఫొటోలను పంచుకుంటూ కూతురు సితార ఘట్టమనేని ఎమోషనల్ పోస్ట్ ను పెట్టింది.
తండ్రికి తగ్గ తనయ మహేశ్ బాబు కూతురు..
మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో పరిచయం అయ్యింది. సర్కారు వారి పాట చిత్రంలో ఒక సాంగ్ లో మెరిసి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ సితార ఘట్టమనేని ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇంట్రెస్టింగ్ వీడియోలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో మహేశ్ బాబు అభిమానులు కూడా సితారను బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరోవైపు సితార కూడా ఎంతో హుందాగా కనిపిస్తూ ఉంటారు. తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటూ వస్తోంది. కుటుంబంతో కలిసి ఏ ఫంక్షన్ కు వెళ్లిన రాయల్ గా, హుందాగా కనిపిస్తూ అందరి ప్రశంసలను అందుకుంటోంది.

మహేశ్ బాబు ఫొటోలను పంచుకుంటూ..
తాజాగా సితారా ఘట్టమనేని తన తండ్రి మహేశ్ బాబుకు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకుంది. ఫాదర్స్ డే సందర్భంగా సూపర్ స్టార్, తన తండ్రి మహేశ్ బాబుతో మిర్రర్ సెల్ఫీలను పంచుకుంది. ఈ సందర్భంగా 'హ్యాపీ ఫాదర్స్ డే నాన్న ఐ లవ్ యూ సో మచ్' అంటూ ఆ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఈపోస్టులకు కొద్ది క్షణాల ముందు మహేశ్ బాబు, సితార, గౌతమ్ కారులో ఉన్న ఫొటోను పంచుకుంటూ ఫాదర్స్ డే విషెస్ తెలిపింది. 'నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నువ్వు ఉహించలేవు నాన్న'.. అంటూ క్యాషన్ ఇచ్చింది. అయితే ఆ ఫొటోలో మహేశ్ బాబు లుక్ కనిపిస్తుండటంతో వెంటనే డిలీట్ చేయడం గమనార్హం. ఆ తర్వాత డైరెక్ట్ ఫొటోలను కాకుండా మిర్రర్ ఫొటోలను పంచుకుంది.
2023 నుంచి మోడలింగ్ లోకి..
సితార ఘట్టమనేని ప్రస్తుతం తన స్కూలింగ్ ను పూర్తి చేసుకుంటోంది. ఓవైపు చదువుపై శ్రద్ధ పెడుతూనే మరోవైపు మోడలింగ్ రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టాప్ జ్యూయెల్లరీ PMJకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. గ్రాండ్ యాడ్ షూట్ లో నటించింది. న్యూయార్క్ స్క్వేర్ లో ఆ యాడ్ ను ప్రదర్శించడం విశేషం. ఆ యాడ్ షూట్ తో వచ్చిన రూ.1కోటీ పారితోషికాన్ని పేదలను ఆదుకునేందుకు విరాళంగా ఇచ్చింది. దాంతో ఒక్కసారి సితార పేరు ఇండియాలో మారుమోగింది.
మహేశ్ బాబు నయా లుక్..
సితార ఘట్టమనేని ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి మహేశ్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే బాబు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది. మహేశ్ బాబు తాజా లుక్ ను చూపించి ఖుషీ చేసింది. ప్రస్తుతం మహేశ్ బాబు తన కూతురితో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మహేశ్ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న SSMB 29 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. నెక్ట్స్ బుచ్చిబాబు, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగాలు బాబుతో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను తెరకెక్కించాలని వెయిటింగ్ లో ఉన్నారు.


Click it and Unblock the Notifications











