మహేష్ డాటర్ మల్టీ టాలెంటెడ్.. సింగర్ అయ్యే ఛాన్స్ ఉందట!

మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎదో ఒక టాపిక్ తో నెటీజన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే.. ఘట్టమనేని ఫ్యామిలిలో ఎక్కువగా ఇంటర్నెట్ లో ట్రెండ్ అయ్యేది సితార అనే చెప్పాలి. గౌతమ్ తండ్రి లాగే సిగ్గుపడుతూ ప్రయివేట్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ సితార బేబి మాత్రం నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో ముందుంటోంది.

చూస్తుంటే అన్ని రకాలుగా సినీ రాంగంలో తన టాలెంట్ ని చూపించేలా ఉందని అర్ధమవుతోంది. ఇప్పటికే ఆర్ట్ లోనే కాకుండా డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్ ని బయటపెట్టిన సీతార తనలో సింగర్ కూడా ఉన్నట్లు అప్పుడప్పుడు నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే భరత్ అనే నేను సినిమాలోని 'ఇది కలలా ఉన్నదే'.. అని సితార పాట పాడింది. తల్లి నమ్రతా శిరోద్కర్‌ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో నిమిషాల్లో వైరల్ గా మారింది.

Mahesh babu daughter sitara singing video viral

ఇక నెటీజన్స్ సితార వాయిస్ కి ఫిదా అవుతున్నారు. సింగర్ గా ట్రై చెయ్.. చిన్ని తల్లి అంటూ మహేష్ అభిమానులు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అన్ని విషయాల్లో పట్టు సాధిస్తున్న సితార బేబి సినిమాల్లో తన టాలెంట్ ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తుందో ఇప్పుడే చెప్పలేము. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాపై చర్చలు జరుపుతున్నారట. పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం ఆ సినిమాకి సంబంధించిన స్పెషల్ అప్డేట్ వెలువడనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X