‘సర్కారు వారి పాట’లో హైలైట్ అదే: ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతున్న మహేశ్

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మూవీని ఎప్పుడో ప్రకటించినప్పటికీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ మాత్రం జరుపుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జనవరిలో దీన్ని పట్టాల మీదకు తీసుకెళ్లారు. ఇందులో భాగంగానే దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. అంతలోనే మరోసారి కరోనా ప్రభావం పెరగడంతో సెకెండ్ షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పరారవుతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ 'సర్కారు వారి పాట' సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నట్లు ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేశ్ బాబు చెప్పే డైలాగులు హైలైట్ కాబోతున్నాయట. మరీ ముఖ్యంగా మాస్ గెటప్‌లో కనిపించినప్పుడు అతడి డైలాగ్ డెలివరీ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని అంటున్నారు. ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులను ఫిదా చేసేలా డైలాగ్స్ రాశారని టాక్.

Mahesh Babu Dioloues Highlight in Sarkaru Vaari Paata

గతంలో 'అతడు', 'పోకిరి', 'దూకుడు'లో మహేశ్ బాబు డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. అదే సినిమాకు హైలైట్‌గా నిలిచింది. వాటి తర్వాత ఇప్పుడు మరోసారి ఆ మేజిక్‌ను రిపీట్ చేయబోతున్నాడట ఈ స్టార్ హీరో. ఇదిలా ఉండగా.. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు జయరాం మహేశ్ తండ్రి పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X