సినీ కార్మికులకు అండగా సూపర్ స్టార్.. తోటి నటీనటులకు మహేష్ బాబు పిలుపు
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనూ, రియల్ లైఫ్‌లోనే ఒకేలా ఉంటున్నాడు. సాయం చేసే గుణం, కష్టకాలంలో ఆదుకునే మానవత్వం మహేష్ బాబు సొంతం. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాడు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు.
సినీ పరిశ్రమకు చెందిన తారలెందరో ప్రభుత్వాలకు అండగా నిలబడుతున్నారు. తమక చేతనైనా ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది హీరోలు సినీ పరిశ్రమ, సినీ కార్మికులు, పేద కళాకారుల గురించి ఆలోచిస్తున్నారు. వారి శ్రేయస్సుకోసం ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని అందించిన సంగతి తెలిసిందే.

తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ కూడా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది. కాసేపటి క్రితమే మహేష్ బాబు సైతం రూ. 25 లక్షల రూపాయలను తెలుగు సినీ పరిశ్రమకు విరాళంగా ప్రకటించారు. టాలీవుడ్‌లోని దినసరి కూలీలకు ఉపయోగపడేందుకు ఈ మొత్తాన్ని ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నాడు. అంతేకాకుండా తన తోటి నటీనటులను కూడా ఈ మంచి పనిలో భాగస్వామ్యులుగా చేరాలని పిలుపునిచ్చాడు.


Click it and Unblock the Notifications











