twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ. కోటి సాయం ప్రకటించిన శ్రీమంతుడు.. బాధ్యతాయుత పౌరులుగా.. మహేష్ బాబు కామెంట్స్

    |

    కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను ప్రకటించాయి. 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని, సురక్షితంగా ఉండాలని సూచించాయి. ప్రజలంతా పరిశుభ్రతను పాటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.

    Recommended Video

    Tollywood Star Heroes Huge Donation To Government | Prabhas | Pawan Kalyan | Ram Charan|Mahesh Babu

    అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు సినీ హీరోలు ముందుకు వచ్చారు. టాలీవుడ్ ప్రముఖులు అంతా వరుసకట్టి విరాళాలు అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతుగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. హీరో నితిన్ మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కొరటాల శివ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి వంటి వారు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

    రూ. కోటి ప్రకటించిన పవన్ కళ్యాణ్..

    రూ. కోటి ప్రకటించిన పవన్ కళ్యాణ్..

    కేంద్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలకు యాభై లక్షల చొప్పున ప్రకటించాడు. త్రివిక్రమ్ పది లక్షల చొప్పున, అనిల్ రావిపూడి, కొరటాల శివ ఐదు లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు.

    మహేష్ బాబు విరాళం..

    ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు చేస్తోన్న కృషి అభినందనీయం.. ఈ యుద్దంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు నా వంతుగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. కోటి రూపాయల విరాళాన్ని అందిస్తున్నాను. మీ వంతుగా సాయం చేయాలని అందర్ని కోరుతున్నాను.

    బాధ్యత గల పౌరులుగా

    బాధ్యత గల పౌరులుగా

    ప్రతీ ఒక్క విరాళం ఎంతో మార్పును తీసుకురావచ్చు.. బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ను, నియమాలను అందరూ పాటించండి.. మీ అందర్నీ నేను అదే కోరుతున్నాను.. మనల్ని మనం కాపాడుకోవాలి.. మనందరం కలిసి పోరాడాలి.. విజయం సాధించాలి.. అంత వరకు ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి.

    English summary
    Mahesh babu Donates One Crore To Ap Ts Government On Covid 19 Epidemic. Let's battle the COVID-19 as a nation! I urge everyone to follow the rules put forth by our Government. My deepest gratitude for all your efforts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X