మా సెలెబ్రేషన్స్‌లో చిరు.. రెట్టింపు ఆనందం.. మహేష్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ పంథా మారుతోంది. ఒకప్పుడు ఏ ఇద్దరు పెద్ద హీరోలు కలిసి ఓ వేదికను పంచుకునే వారు కాదు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఓ టాప్ స్టార్ ఈవెంట్‌కు మరో స్టార్ హీరో వచ్చి..ఇరువురు అభిమానులను ఖుషీ అయ్యేలా చేస్తున్నారు. మహేష్ బాబు ఈవెంట్లకు ఎన్టీఆర్, వెంకటేష్ వంటి హీరోలు హాజరైన సంగతి తెలిసిందే.
తాజాగా మహేష్ సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. జనవరి 5న జరగబోతోన్న ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలిచి మెగా అభిమానులను తమ వైపుకు తిప్పుకున్నారు. నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర, దర్శకుడు అనిల్ రావిపూడి చిరు ఇంటికి వెళ్లి.. సరిలేరు ఈవెంట్‌కు రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు విడుదల చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఈవెంట్‌కు వచ్చేందుకు చిరంజీవి అంగీకరించడంతో ఆనందంలో మునిగిపోయిన మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. 'మా ఈ సెలెబ్రేషన్‌లో భాగం అవుతున్నందుకు మాకు ఆనందంగా ఉంది.. మీ రాకతో మా ఆనందరం రెట్టింపు అవుతుంది. ఈ ల్యాండ్ మార్క్ ఈవెంట్‌ను సరిలేరు నీకెవ్వరు యూనిట్ ఎప్పటికీ మరిచిపోదు. ఈవెంట్‌కు రావడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు.. మీ రాక కోసం ఎదురుచూస్తుంటామ'ని తెలిపాడు.


Click it and Unblock the Notifications











