యాభై రోజుల సరిలేరు.. వారిద్దరికీ బిగ్ హగ్.. మహేష్ బాబు పోస్ట్
మహేష్ బాబు కెరీర్‌లో నిలిచిపోయే చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్‌కు సూపర్ స్టార్ అవకాశమివ్వడం ఏంటని ప్రశ్నించిన వారూ ఉన్నారు. అయితే సరిలేరు చిత్రంతో అందరికీ సమాధానం చెప్పాడు అనిల్ రావిపూడి. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంతో తన శైలి ఎప్పటికీ ప్రత్యేకమేనని మరోసారి నిరూపించాడు. ఫ్యాన్స్‌కు వావ్ అనిపించే ఎన్నో మూమెంట్స్ సరిలేరులో ఉన్నాయి. నేడు సరిలేరు నీకెవ్వరు వచ్చి యాభై రోజులైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి, మహేష్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు.

ఫ్యాన్స్‌కు ట్రీట్..
సరిలేరు నీకెవ్వరు సినిమా ఫ్యాన్స్ ట్రీట్‌లా ఉంటుంది. ప్రతీ సీన్‌లో హీరోయిజాన్ని, మహేష్ బాబును పీక్స్‌లో చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ నిజంగానే నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్టుగానే ఉంటుంది. ఇలాంటి ఎన్నో మూమెంట్స్ సరిలేరులో ఉండడం, మహేష్ ఎనర్జీ, డ్యాన్సులు ఇలా ప్రతీ ఒక్కటి సరిలేరును బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలబెట్టాయి.
దర్శకుడి ఎమోషనల్ ట్వీట్..
మరో మెమరబుల్ సంక్రాంతిని ఇచ్చారని, నిర్మాతకు లాభాలను ఇచ్చారని చెప్పుకొచ్చాడు. హీరో నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశారని డిస్ట్రీబ్యూటర్లందరూ పెట్టిన రూపాయికి మరో రూపాయిని సంపాదించేలా చేశారని అన్నాడు. ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పాడు.

వారిద్దరికి బిగ్ హగ్..
‘సరిలేరు నీకెవ్వరు సినిమాకు 50 రోజులు.. ఇలాంటి ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడికి, నిర్మాత అనిల్ సుంకరకు ఓ పేద్ద హగ్.. ప్రత్యేకంగా నా టీమ్.. వారు లేకపోతే ఇదంతా జరిగేది కాదు.. విజయశాంతి, రష్మిక, దేవీ, రత్నవేలు, ప్రకాష్ రాజ్ అందరికీ థ్యాంక్స్ ' అని చెప్పుకొచ్చాడు.

అదిరిపోయే రెస్పాన్స్..
‘సరిలేరు నీకెవ్వరుకు వచ్చిన రెస్పాన్స్‌ను చూసి చాలా ఆనందించాను.. నాకు మద్దతుగా నిలిచే నా ఫ్యాన్స్ అందరికీ థన్యవాదాలు.. ఇది కచ్చితంగా నాకు అద్భుతమైన క్షణాల'ని ట్వీట్ చేశాడు. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లకు పైగా షేర్ సాధించి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.


Click it and Unblock the Notifications











