రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మహేష్.. ఎట్టకేలకు ఇంట్రస్టింగ్ అప్‌డేట్ చెప్పేశారు

షూటింగ్‌లో కాస్త బ్రేక్ దొరికిందంటే చాలు మహేష్ బాబు ఫారెన్ టూర్స్ వంకే చూస్తుంటారు. తానొక్కడే కాదు భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితార లను వెంట పెట్టుకొని ఫ్లయిట్ ఎక్కేస్తుంటారు. ఈ నేపథ్యం లోనే ఇటీవలే తన 25 వ సినిమా మహర్షి ఫినిష్ చేసుకున్న మహేష్ బాబు.. ఎప్పటిలాగే ఫ్యామిలీతో షికారుకు బయల్దేరారు. మొన్న జరిగిన తన 26వ సినిమా ముహూర్తానికి కూడా హాజరు కాని మహేష్ బాబు.. తాజాగా తన టూర్ అప్‌డేట్ చెప్పారు.

దాదాపు 15 రోజుల క్రిందట..

మహర్షి సక్సెస్ సెలెబ్రేట్ చేసుకునేందుకు ఈ సారి మహేష్ బాబు లాంగ్ టూర్ వేశారు. భార్యాపిల్లలతో కలిసి గత నెల 20 వ తేదీన గగన షికారుకు బయల్దేరిన ఆయన.. ఇంకా ఫారెన్ లోనే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇన్ని రోజులుగా తాను ఎక్కడున్నది ప్రకటించని మహేష్.. తాజాగా చేసిన ట్వీట్‌లో టూర్ విశేషాలు చెప్పారు.

రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ

బుధవారం రంజాన్ పండగ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మహేష్. ఈ మేరకు అందరూ ఆనందంగా ఉండాలని, దేవుడి ఆశీస్సులు ప్రతీ ఒక్కరిపై ఉంటాయని పేర్కొంటూ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ చూసిన ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. తిరిగి మహేష్‌కి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌ని హోరెత్తించారు.

జర్మనీ అద్భుతం.. ఇక ఇటలీకి

జర్మనీ అద్భుతం.. ఇక ఇటలీకి

ఇన్ని రోజులు జర్మనీలో మహర్షి సక్సెస్ ఎంజాయ్ చేసిన మేము ఇక ఇటలీకి బయల్దేరుతున్నాం, జర్మనీ అద్భుతంగా ఉంది అని పేర్కొంటూ మరో ట్వీట్ చేశారు మహేష్. ఈ మేరకు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. దీంతో.. ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫ్యామిలీని చూసి ముచ్చట పడుతున్నారు ఆయన అభిమానులు.

మహేష్ 26 వివరాలు

మహేష్ 26 వివరాలు

మహర్షి మూవీ ఇచ్చిన ఊపు లోనే తన 26 వ సినిమా చేయనున్నారు మహేష్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ కన్ఫర్మ్ చేసి ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జూన్ చివరివారంలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 మహేష్‌తో క్రేజీ భామ.. విజయశాంతి పవర్‌ఫుల్ ఎంట్రీ

మహేష్‌తో క్రేజీ భామ.. విజయశాంతి పవర్‌ఫుల్ ఎంట్రీ

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు సరసన క్రేజీ భామ రష్మిక మందన్న నటించనుంది. ఈ నేపథ్యంలో మహేష్, రష్మిక రొమాన్స్ చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు ప్రేక్షకులు. ఇక లేడీ అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ళ తర్వాత ఈ సినిమాతో రే ఎంట్రీ ఇస్తూ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X