సెట్‌లోకి మహేష్ ఎంట్రీ .. కానీ సర్కారు వారి పాట కోసం కాదట!!
ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో మళ్లీ మంచి రోజులు రాబోతోన్నట్టు కనిపిస్తున్నాయి. దాదాపు ఐదు నెలల పాటు ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో ఎంతో మంది ఉపాధి లేక విలవిల్లాడిపోయారు. కరోనా ఎంతకీ తగ్గకపోవడంతో చూసి చూసి సినిమా షూటింగ్స్ మొదలెట్టేశారు. అయితే పెద్ద హీరోలెవ్వరూ ఇంత వరకు సెట్‌లోకి అడుగుపెట్టి మేకప్ వేసుకోలేదు. ఇక సీనియర్ హీరోలైతే షూటింగ్‌లకు ఆమడ దూరంలో ఉన్నారు.
ఒక్క నాగార్జున తప్పా స్టార్ హీరోలు, సీనియర్ హీరోలెవ్వరూ సెట్స్ పైకి వెళ్లలేదు. మీడియం రేంజ్ హీరోలు,చిన్న సినిమాలు మాత్రం ఆల్రెడీ షూటింగ్‌లను స్టార్ట్ చేసేశాయి. భారీ బడ్జెట్ చిత్రాలు సైతం షూటింగ్‌కు వెళ్లే ఆలోచనలే ఉన్నాయి. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ క్రమంలో మహేష్ బాబు నేడు సెట్ పైకి వచ్చాడు. కానీ అది తన సర్కారు వారి పాట కోసం కాదు.

మహేష్ బాబు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడంతో ఎంత ముందుంటాడో అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఓ యాడ్ షూటింగ్‌లో మహేష్ బాబు పాల్గొన్నాడు. ఈరోజు, రేపు జరిగే ఈ షూటింగ్‌లో మహేష్ బాబు పాల్గొంటాడట. అయితే పరిమిత సంఖ్యతోనే షూటింగ్ జరుపుతుండటంతో మహేష్ ఓకే చెప్పాడట. కానీ సర్కారు వారి పాట షూటింగ్ కోసం మాత్రం అలా కుదరదు. అందుకే ఈ మూవీ షూటింగ్‌ను ఇప్పట్లో వద్దని మహేష్ బాబు చెబుతున్నాడట.


Click it and Unblock the Notifications











