దేవర థియేటర్‌లో రాజమౌళి.. జక్కన్నను నిలదీసిన మహేష్ బాబు ఫ్యాన్!
ఆర్ఆర్ఆర్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ను సాధించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి . దీంతో ఆయన నెక్ట్స్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో తన తర్వాత సినిమా ఉంటుందని జక్కన్న ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇన్ని రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు #SSMB29పై ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో మహేశ్ అభిమానులు హర్ట్ అవుతున్నారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రాజెక్ట్ అప్‌డేట్స్ కోసం జక్కన్నని ఫ్యాన్స్ వేధిస్తున్నారు. తాజాగా రాజమౌళి ఏకంగా థియేటర్‌లోనే జనానికి దొరికిపోయారు. ఈ వివరాల్లోకి వెళితే..
రాజమౌళి సినిమా కోసం మహేశ్ బాబు కంప్లీట్‌గా మేకోవర్ అవుతున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రిన్స్ కలిశారు. వరద బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్‌కు వ్యక్తిగతంగా రూ.50 లక్షలు.. ఏఎంబీ సినిమాస్ తరపున రూ.10 పది లక్షలను మహేశ్ విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చెక్‌ను మహేశ్, నమత్ర దంపతులు సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా లాంగ్ హెయిర్‌తో రుషిలా ఉన్న మహేశ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ క్లీన్ సేవ్‌తో కనిపించే మహేశ్ ఈ సినిమా కోసం గడ్డం కూడా పెంచారు.

అంతాబాగానే ఉంది కానీ .. ఈ సినిమా బడ్జెట్ ఎంత, మహేశ్ బాబు రెమ్యునరేషన్ ఎంతనే దానిపై ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. బడ్జెట్ ఎంత అనేది ఇంకా ఫిక్స్ కాలేదని, ఎంత అవసరం అనుకుంటే అంత ఖర్చు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కేఎల్ నారాయణ స్పష్టం చేశారు.
ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి కొడుకు చేతికి అప్పగించగా.. జక్కన్న దానికి ఫైనల్‌గా రాజముద్ర వేయాల్సి ఉంది. రోజులు గడుస్తున్నా ఎస్ఎస్ఎంబీ29 మూవీ అప్‌డేట్స్ ఏం బయటకు రాకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ , మూవీ లవర్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. మొన్నామధ్య మత్తువదలరా 2 టీమ్ ఏకంగా జక్కన్న నుంచే వివరాలు లాగే ప్రయత్నం చేసి ఆయన చేతిలో దెబ్బలు తినేవారు. అక్టోబర్ 10న రాజమౌళి పుట్టినరోజు కావడంతో ఆ రోజున ఏమైనా స్పెషల్ అనౌన్స్ ఉంటుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

తాజాగా రాజమౌళిని మరోసారి మహేశ్ అభిమానులు రౌండప్ చేశారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని మైత్రీ విమల్ థియేటర్‌లో సినిమాను వీక్షించారు. అయితే ఇంటర్వెల్ సమయంలో మహేశ్ అభిమాని ఒకరు వెనుక సీట్లో రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళిని చూసి అన్నా #SSMB29 అప్‌డేట్ ఇవ్వాలని , బాగా ఆకలి మీద ఉన్నామని అరుస్తాడు. అది విన్న రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు నవ్వుతారు కానీ ఏ సమాధానం చెప్పరు. ప్రస్తుత దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://x.com/urstruly_rocky/status/1839515355883974889?t=mhtT6lBtxPusOPzXL4q8tg&s=08


Click it and Unblock the Notifications











