ఖలేజా సినిమాకు పాముతో అభిమాని.. మహేశ్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం!

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేశ్ బాబుకు ఉన్న ఫ్యాన్ బేస్ తెలుగు స్టేట్స్ లో మరెవ్వరికీ లేదనే వారి ఫ్యాన్స్ రుజువు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా మహేశ్ బాబు వీరాభిమానులు చేసిన పనులు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమ అభిమాన హీరోపై కురిపిస్తున్న ప్రేమకు కొందరు అభినందిస్తుంటే.. మరికొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? ఏంటనే వివరాల్లోకి వెళ్లితే..

మహేశ్ బాబు ఖలేజా రీరిలీజ్..
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ అభిమాన హీరోల ఉత్తమ చిత్రాలను ప్రత్యేక రోజుల్లో రీ రిలీజ్ చేస్తూ థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు ఒక్కడు, బిజినెస్ మెన్, పోకిరీ.. వంటి చిత్రాలు రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మే 30న ఖలేజా చిత్రం విడుదలైంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. కనకరత్న మూవీస్ బ్యానర్ పై రూ. 30 కోట్లతో రూపుదిద్దుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.18 కోట్లు మాత్రమే వసూల్ చేసింది.

Mahesh Babu Fan bring snake to Theatre for Khaleja movie Re release occasion

మహేశ్ బాబు అభిమానుల అత్యుత్సాం..
ఖలేజా రీరిలీజ్ ను తెలుగు స్టేట్స్ తో యూఎస్ లోనూ చేశారు. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ ఫుల్ జోష్ చూపించారు. అయితే విజయవాడలోని ఓ థియేటర్ లో అభిమానులు అత్యుత్సాహం చూపించారు. అభిమానులతో పాటు ఆడియెన్స్ కూడా రీ రిలీజ్ కు వచ్చారు. అయితే ఫ్యాన్స్ మహేశ్ బాబు సీన్లను రీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కొందరు డ్యాన్స్ లు, డైలాగ్స్ తో అదరగొట్టారు. మరికొరు హాస్పత్రి సీన్ ను చేసి ఆకట్టుకున్నారు. ఇక మరో అభిమాని ఏకంగా మహేశ్ బాబు ఏంట్రీ సీన్ ను రీ క్రియేట్ చేశారు. మహేశ్ బాబులా చేతిలో పామును తీసుకొని థియేటర్ లోకి వచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఫ్యాన్స్ అత్యుత్సాహంపై అభ్యంతరాలు..
మహేశ్ బాబు అభిమానులు చూపించే ప్రేమను చాలా వరకు సమర్థిస్తున్నా.. వారు చేసే కొన్ని అత్యుత్సాహ పనులను మాత్రం నెటిజన్లు ఒప్పుకోవడం లేదు. విషపూరితమైన జీవరాశులను థియేటర్ లోకి తీసుకొస్తే ఆడియెన్స్ బయపడ్డారని, పాముతో హస్యం చేయాలని చూస్తే ప్రమాదాన్ని కొని తెచ్చకోవడమే అంటున్నారు. ఇలాగైతే ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోతారని, అభిమానాన్ని చూపించాలి కానీ, ఇలాంటి పనులు చేయొద్దని సూచిస్తున్నారు.

మహేశ్ బాబు - రాజమౌళి చిత్రం..
చివరిగా మహేశ్ బాబు గుంటూరు కారం చిత్రంతో అలరించాడు. ఆ సినిమాకు త్రివిక్రమే దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB29 చిత్రంలో నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ్ ఈ చిత్రాన్ని రూ.1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X