థియేటర్‌లో ప్రేమ జంట పెళ్లి.. మురారీ స్పెషల్ స్క్రీనింగ్‌లో తాళి కట్టిన వరుడు.. మహేష్ ఫ్యాన్స్ పండగలా!

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు - క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మురారి ఘన విజయం సాధించింది. 2001 ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచి మహేశ్‌ను నటుడిగా ఓ మెట్టుపైకెక్కించింది. ఓ దేవత ఆగ్రహానికి కారణమై శాపం పొందిన వంశానికి చెందిన వ్యక్తుల వరుస మరణాలు, హీరోకి ప్రాణ గండం, కుటుంబాలలో బంధాలు, మనస్పర్ధలను ఇతివృత్తంగా తీసుకుని కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కించారు.

హీరోగా ఎంట్రీ ఇచ్చి అప్పటికే మూడు సినిమాల్లో నటించినా మహేశ్ కెరీర్‌లో మాత్రం మురారీ తొలి సిల్వర్ జూబ్లీగా నిలిచింది. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మురారి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో పాటు 23 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. ఇందులో మహేశ్‌కు జోడీగా నటించిన సోనాలి బింద్రేకు ఇదే తొలి తెలుగు సినిమా. మురారి ఘన విజయంతో ఆమెకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, శ్రీకాంత్ తదితరుల చిత్రాల్లో నటించే అవకాశం దక్కింది.

Mahesh babu fan tie knot during murari re release screening and video goes viral

కథపరంగానే కాకుండా , మ్యూజికల్‌గానూ మురారి క్లాసిక్‌గా నిలిచింది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలు ఎవర్‌గ్రీన్. ప్రతి పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. ముఖ్యంగా అలనాటి రామచంద్రుడి పాట ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది. నేటికీ పెళ్లి వేడుకల్లో , పెళ్లి క్యాసెట్స్‌కి బీజీగా ఈ సాంగ్ ప్లే కావాల్సిందే. అంతగా ఈ పాట జనాన్ని ఒక ఊపు ఊపింది. తెలుగునాట పెళ్లి తంతు మొదలైన నాటి నుంచి కొత్త జంట మొదటి రాత్రి జరుపుకునే వరకు అన్ని ఘట్టాల్ని కృష్ణవంశీ సెల్యూలాయిడ్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు.

తెలుగు సినిమా ఫాలో అయ్యే కమర్షియల్ సూత్రం ప్రకారం.. క్లైమాక్స్‌‌కు ముందు హీరోకి మాస్ సాంగ్ ఉండాలి. అలాంటిది క్లాస్‌గా ఉండే ఈ పాటను పెట్టడాన్ని మహేశ్ సహా అందరూ వద్దన్నారని.. చివరికి కృష్ణగారి వరకు పంచాయతీ వెళ్లగా , ఆయనను కూడా ఒప్పించి అలనాటి బాలచంద్రుడి సాంగ్‌ను పెట్టానని కృష్ణవంశీ ఒకానొక సందర్భంలో చెప్పారు. కట్ చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ ప్లే అవుతుండగా ఓ మహేశ్ అభిమాని ఏకంగా థియేటర్‌లోనే మూడు ముళ్లు వేశాడు.

Mahesh babu fan tie knot during murari re release screening and video goes viral

ప్రజెంట్ రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో మహేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ఆగస్ట్ 9న మురారి మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో ఉదయం నుంచి సూపర్‌స్టార్ అభిమానులు థియేటర్ల నుంచి సందడి చేశారు. ఈ నేపథ్యంలో సరిగ్గా అలనాటి రామచంద్రుడి పాట స్క్రీన్‌పై వస్తుండగా మహేశ్ అభిమాని ఒకరు అమ్మాయికి తాళిబొట్టు కట్టి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతని ఫ్రెండ్స్ ఆడియన్స్‌కి అక్షింతలు పంచడంతో థియేటర్ మొత్తం ఈ కొత్త జంటని ఆశీర్వదించింది. ఈ పెళ్లి తంతుకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X