Mahesh babu కోసం మంచి పనులు చేస్తున్న ఫ్యాన్స్.. అర్ధరాత్రి సూపర్ స్టార్ ఇంటివద్ద సెలబ్రేషన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బుధవారం నుంచి అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. ఆగస్టు 9 అంటే ఘట్టమనేని ఫాలోవర్స్ కు ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ గా సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే గత రెండు సంవత్సరాలలో కరోనా వైరస్ కారణంగా అభిమానులు పుట్టినరోజు వేడుకలకు కాస్త దూరంగానే ఉన్నారు. మహేష్ కూడా ఎంతో బాధ్యతగా అభిమానులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ ఇంట్లోనే క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా కూడా స్టార్ హీరో మాటను గౌరవించే ఎంతో బాధ్యతగా వేడుకలకు దూరంగా ఉన్నారు.

ఇక మరోసారి పుట్టినరోజు సందర్భంగా మంచి పనులు చేసి ఆ ప్రేమకు తనకు తిరిగి ఇవ్వాలని మహేష్ బాబు తన అభిమానులను పిలుపునిస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం వలన చెట్లకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అందుకే ప్రతి ఒక్కరు మొక్కలను నాటి ప్రకృతి సంరక్షణలో బాధ్యులు కావాలని, అదే మీరు అందరూ తనకు ఇచ్చే పుట్టినరోజు కానుక అని ఇటీవల సోషల్ మీడియాలో మహేష్ బాబు వాళ్లకు చాలెంజ్ ఇచ్చారు. ఒక స్టార్ హీరో మాటను ఎంతో బాధ్యతగా తీసుకున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ని అభిమానుల్లో వారి వంతు కృషిగా అనేక చోట్లలో మొక్కలు నాటుతున్నట్లు కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

Mahesh babu fans birthday celebrations with good works

ఇక అర్ధరాత్రి సమయంలో కొంతమంది అభిమానులు హైదరాబాద్ లోనే మహేష్ బాబు ఇంటికి చేరుకొని విషెస్ అందించాలని నిన్న సాయంత్రం నుంచే ఎదురుచూశారు. రాత్రి 12 కాగానే మొదటి సేకనులోనే హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు అంటూ వారికి నచ్చిన నినాదాలతో హ్యాపీ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించినవి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ బర్త్ డే బ్లాస్టర్ ఉదయమే విడుదల చేశారు. అసలైతే ఈరోజు ఉదయం 9 గంటలకు విడుదల చేయాలని అనుకున్నారు కానీ అర్ధరాత్రి సమయంలోనే అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేయడంతో వారికి మంచి కిక్ ఇచ్చే విధంగా బర్త్ డే బ్లాస్టర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఉదయం చూసిన కొందరు అభిమానులు పరశురామ్ పై ఎంతగానో పాజిటివ్ కామెంట్స్ చేశారు. చాలామంది దర్శకుల కంటే నువ్వు సూపర్ ఫాస్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సినిమా టీజర్ కూడా మరోసారి సినిమాపై అంచనాలను పెంచేసింది. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇక కీర్తి సురేష్ మొదటిసారి మహేష్ బాబుతో నటిస్తుండగా ఈ జోడిపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X