Guntur Kaaram: ట్రైలర్‌పై కంప్లైంట్ చేస్తున్న ఫ్యాన్స్.. ఈ టెక్నికల్ ప్రాబ్లం మీక్కూడా వచ్చిందా?
హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కించుకుంటూ వెళ్లే హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. అలా అస్సలు గ్యాప్ లేకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సినిమాతో అలరిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ స్టార్ హీరో 'గుంటూరు కారం' అనే మూవీలో నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు.
గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంతో పక్కా మాస్ మూవీగా 'గుంటూరు కారం' మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఫ్యామిలీ డ్రామాను కూడా యాడ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నారు. మొత్తనికి ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలిపేశారు.
Recommended Video


'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఇటీవలే ఈ సినిమా నుంచి అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు. ముఖ్యంగా ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్, మహేశ్ బాబు యాస, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ అద్భుతంగా అనిపించాయి.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'గుంటూరు కారం' ట్రైలర్‌కు మహేశ్ అభిమానుల నుంచే కాకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా దీనికి అత్యధిక మొత్తంలో వ్యూస్, లైకులు దక్కుతున్నాయి. అంతేకాదు, విడుదలైన కొన్ని గంటల్లోనే ఇది యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతూ ఎన్నో రికార్డులను ఇది క్రియేట్ చేసింది.

'గుంటూరు కారం' మూవీ ట్రైలర్ విషయంలో ఓ కంప్లైంట్ కూడా బాగానే వినిపిస్తోంది. ఇందులో సౌండ్ మిక్సింగ్ సరిగా కుదరలేదని చాలా మంది చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ట్రైలర్‌ను హోం థియేటర్‌లో కానీ, టీవీలో కానీ ప్రసారం చేస్తే డైలాగ్స్ క్లారిటీ రావట్లేదట. సినిమా థియేటర్లలో కూడా ఇలా ఉంటే సమస్య అవుతుందని ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా... 'గుంటూరు కారం' మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











