Pokiri రీ రిలీజ్ కలెక్షన్స్.. మహేష్ బాబు ఫౌండేషన్ కోసమే కాదు.. వాళ్లకు కూడా..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా మళ్లీ ఇన్నాళ్లకు విడుదలైనప్పటికీ కూడా థియేటర్లో అదే తరహా వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఘట్టమనేని అభిమానులు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ షోలు వేయించుకొని మరి ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా పోకిరి సినిమా హడావుడి చేసింది. అలాగే పొరుగు రాష్ట్రాలలో కూడా మహేష్ బాబు అభిమానులు ప్రత్యేకమైన షోలను వీక్షించడం విశేషం.

దాదాపు ప్రదర్శించిన షోలన్నిటికీ కూడా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇచ్చాయి అంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మొదట ఈ సినిమా స్పెషల్ షోలకు సంబంధించిన కలెక్షన్స్ అన్నీ కూడా మహేష్ బాబు ఫౌండేషన్ కోసం విరాళంగా ఇవ్వబోతున్నట్లుగా అభిమానులు అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రకటించారు. కేవలం సినిమా థియేటర్ల చార్జీలకు మినహాయించి మిగతా కలెక్షన్స్ అన్నీ కూడా మహేష్ సేవా సంస్థకు ఉపయోగించాలని డిసైడ్ అయ్యారు.

Mahesh babu fans for noble cause with pokiri movie rerelease collections

మహేష్ బాబు ఎంతోమంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే అభిమానులు పోకిరి కలెక్షన్స్ ద్వారా మహేష్ బాబు ఫౌండేషన్ సంస్థకు విరాళాలు అందించారు. అయితే ఇందులో మరికొంత భాగాన్ని తెలుగు ఫిలిం డైరెక్టర్ ట్రస్ట్ కు కూడా విరాళంగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా అభిమానులు వారి అభిమాన హీరో పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ విధంగా కొన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం విశేషం. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా జల్సా సినిమా ద్వారా ఇదే తరహాలో కొన్ని మంచి కార్యక్రమాలకు కార్యరూపం దాల్చబోతున్నారు. మరి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X