twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ చేస్తున్నాడు.. మహేష్ కూడా చేయాల్సిందే!, లేకుంటే ఫ్యాన్స్ తట్టుకోలేరు?

    |

    టాలీవుడ్ లో మన స్టార్ హీరోల మార్కెట్ రోజేరోజుకి బాలీవుడ్ స్టార్స్ ని మించిపోతోంది. గతంలో ఎప్పుడు లేని విదంగా మన హీరోలు ఎంచుకుంటున్న ప్రాజెక్టులు ప్రపంచ దేశాలని ఆకర్షిస్తున్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా మన తెలుగు సినిమాలు డైరెక్ట్ గా రిలీజైన మిగతా భాషల వాళ్ళు చూడటానికి ఇష్టపడుతున్నారు.

    బాహుబలి తెచ్చిన పాన్ ఇండియా..

    బాహుబలి తెచ్చిన పాన్ ఇండియా..

    బాహుబలి సినిమా తరువాత బిగ్ బడ్జెట్ సినిమాలు చాలా పూట్టుకొస్తున్నాయి. భరతదేశంలో ఒక మంచి సినిమాకు ఇంతగా మార్కెట్ ఉందా అని విదేశీ టెక్నీషియన్స్ కూడా ఆశ్చర్యపోయారు. అందుకే హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ స్థానిక భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. ఇకపోతే మన టాలీవుడ్ స్టార్స్ ఏ మాత్రం ఛాన్స్ దొరికినా పాన్ ఇండియా అనేస్తున్నారు.

    బన్నీ కూడా మొదలెట్టేశాడు..

    బన్నీ కూడా మొదలెట్టేశాడు..

    మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, గత ఏడాది (సైరా, సాహూ) పాన్ ఇండియా సినిమాలను భారీ స్థాయిలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ RRR ద్వారా మిగతా భాషల్లో హై రేంజ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ - క్రిష్ సినిమా కూడా మిగతా భాషల్లో విడుదల కానుండగా ఇప్పుడు బన్నీ కూడా 'పుష్ప' సినిమాతో స్ట్రాంగ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

    ఇప్పుడు మహేష్ టార్గెట్..

    ఇప్పుడు మహేష్ టార్గెట్..

    మహేష్ బాబు కూడా పాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేయాల్సిందే అంటున్నారు ఆయన అభిమానులు. ఒకసారి స్పైడర్ సినిమా ద్వారా చిన్నపాటి పాన్ ఇండియా ప్లాన్ వేసిన మహేష్ ఊహించని డిజాస్టర్ అందుకున్నాడు. ఆ దెబ్బతో మిగతా భాషల్లో సినిమా చేయడం సేఫ్ కాదని ఫిక్స్ అయ్యాడు. కానీ ఇప్పుడు మహేష్ కూడా ఛాన్స్ చూసుకొని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మొదలు పెడితే బెటర్ అని అంటున్నారు ఫ్యాన్స్. లేకుంటే వారు కొంత అసంతృప్తికి అయ్యే అవకాశం ఉంది.

    మిగతా హీరోలు కూడా..

    మిగతా హీరోలు కూడా..

    విజయ్ దేవరకొండ ముందుగా సౌత్ లో సక్సెస్ అవ్వాలని అన్ని భాషల్లో డియర్ కామ్రేడ్ ని వదిలాడు. కానీ ఆ సినిమా ఊహించని దెబ్బ కొట్టింది. ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ తో చేస్తున్న ఫైటర్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకోవాలని హిందీలో కూడా ట్రై చేస్తున్నాడు. ఇక నాని, వెంకటేష్, గోపిచంద్ వంటి హీరోలు కూడా కుదిరితే పాన్ ఇండియా మూవీ చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్ వస్తోంది.

    English summary
    Mahesh Babu fans also says that he should start a Pan India movie. Mahesh received an unexpected disaster as he once had a plan for Pan India through Spyder Cinema. Fixing that it was not safe to make films in other languages ​​with that blow. But now Mahesh is also interested in starting a pan India project,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X