twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం: ‘మహర్షి’ థియేటర్ షాట్స్ వైరల్

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' మూవీ రిలీజ్ నేపథ్యంలో ఫ్యాన్ సర్కిల్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మహేష్ వీరాభిమానులు 'మహర్షి' మూవీ థియేటర్లను కొత్త పెళ్లి కూతురులా ముస్తాబు చేశారు. భారీ కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేసి బ్యాండ్ బాజాలతో సందడి చేశారు.

    తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' మూవీ విడుదలైన అన్ని థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. ముందుగా టిక్కెట్లు దక్కించుకోలేని ఫ్యాన్స్ బ్లాక్‌లో అత్యధిక రేట్లు చెల్లించి టికెట్స్ కొన్న దృశ్యాలు కనిపించాయి. సూపర్ స్టార్ మూవీ ఫస్ట్ డే చూడటంలో వచ్చే కిక్ అలాంటిది, ఆ కిక్ కోసం ఖర్చుకు వెనకాడబోమని అంటున్నారు.

    అభిమానుల అత్యుత్సాహం

    అభిమానుల అత్యుత్సాహం

    థియేటర్లో మహేష్ బాబు స్క్రీన్ మీద ఎంట్రీ ఇవ్వగానే కొందరు అభిమానులు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఫ్యాన్స్ అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తమ మొబైల్‌లో చిన్న చిన్న షాట్లు చిత్రీకరించి ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు.

    బ్లాక్ బస్టర్ బొమ్మ అంటూ

    ‘మహర్షి' మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘బ్లాక్ బస్టర్ బొమ్మ'. మహేష్ బాబు కెరీర్లో ది బెస్ట్ మూవీ ఇది. ఒక మంచి సందేశాత్మక చిత్రం అంటూ అభిమానులు థియేటర్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

    అభిమానులకు కిక్కిచ్చే సీన్లు చాలా ఉన్నాయి

    ‘మహర్షి' మూవీ పక్కా కమర్షియల్ ఎంటర్టెనర్. అభిమానులకు మంచి కిక్కిచ్చే సీన్లు చాలా ఉన్నాయి. పైసా వసూల్ మూవీ. సాధారణ ప్రేక్షకులు సైతం టికెట్ కోసం తాము పెట్టిన డబ్బుకు రెట్టింపు సంతృప్తి పొందడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    స్క్రీన్ ముందు పూనకం వచ్చినట్లు ఊగిపోయిన ఫ్యాన్స్

    కొన్ని థియేటర్లలో అభిమానులు సూపర్ స్టార్‌ను చూసిన ఆనందంలో స్క్రీన్ ముందు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. 40 ఏళ్ల వయసులోనూ మహేష్ బాబు కాలేజీ కుర్రాడిలా కనిపించడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

    మహర్షి

    మహర్షి

    మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కుతోంది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు..

    English summary
    Mahesh Babu fans shared Maharshi movie Theatre screenshots in twitter. Maharshi directed by Vamsi Paidipally and jointly produced by Dil Raju, C. Ashwini Dutt, and Prasad V. Potluri through their production companies Sri Venkateswara Creations, Vyjayanthi Movies, and PVP Cinema. The film stars Mahesh Babu, Allari Naresh, and Pooja Hegde. The music was composed by Devi Sri Prasad. Maharshi was released on 9 May 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X