SSMB29: రాజమౌళి మూవీపై చరణ్ హాట్ కామెంట్స్.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుండె దడ
కేవలం ఈ గడిచిన ఐదేళ్ల లోనే ప్రపంచ మునుపెన్నడూ చూడని భయంకర ఎత్తుపల్లాలు చూసింది. ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల కితం జరిగిన పలు ప్యాండమిక్ లు లాంటివి గత 2020 లో మళ్ళీ వచ్చి ప్రపంచాన్ని స్తంభింపజేసింది అని చెప్పాలి. కాగా ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. ఇంకా చెప్పాలంటే కోలుకోలేకుండా దివాళా తీసేసే పరిస్థితుల్లోకి కూడా వెళ్లిపోయాయి.
కాగా ఆ రంగాల్లో సినిమా రంగం కూడా ఒకటి. దాదాపు ఆ రెండున్నరేళ్లు కూడా సినిమా థియేటర్స్ పరంగా చాలా నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో థియేటర్స్ కి జనం తగ్గడం ఓటిటిలు ఊపందుకోవడంతో చాలా వరకు జనం ఇప్పటికీ థియేటర్స్ కి వచ్చేందుకు అంత ఆసక్తి చూపించడం లేదు. సరే ఎట్టకేలకి అన్నీ సెట్ అయ్యాయి. ఒకో భారీ సినిమా పట్టాలెక్కుతూ వస్తున్నాయి.

కాగా ఇప్పుడు వరకు వచ్చిన చాలా సినిమాలు కరోనా లేకపోతే ఎప్పుడో వచ్చేయాల్సినవే కానీ అలా ఆలస్యం అవుతూ వచ్చాయి. ఇక ఈ ప్యాండమిక్ తర్వాత పలు సంచలన సినిమాలు వస్తే వాటిలో ఒక్క ఇండియన్ సినిమా మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఎదురు చూస్తున్న సినిమాగా దర్శకుడు ఏసెస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ సినిమా అని చెప్పొచ్చు.
కాగా రాజమౌళి సినిమా అంటేనే లేట్ అనే మార్క్ ఇండస్ట్రీలో లేకపోలేదు. తాను ఫాస్ట్ గా తీద్దాం అనుకున్నా పరిస్థితులు అనుకూలించవు. సరిగ్గా ఇదే తన గత సినిమా RRR విషయంలో జరిగింది. ఆ సినిమా ఎప్పుడో రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ 2022 లో వచ్చింది.

ఇక నెక్స్ట్ మహేష్ బాబు సినిమాకి కూడా చాలా గ్యాప్ రాగా ఈ సినిమా జస్ట్ మొన్ననే స్టార్ట్ అయ్యింది ఈ సినిమాపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన కీలక కామెంట్స్ ఇపుడు మహేష్ బాబు అభిమానుల్లో కొత్త టెన్షన్ ని తెచ్చి పెట్టాయి. ఇటీవల గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ కి రాజమౌళి వస్తే రామ్ చరణ్ మహేష్ తో చేస్తున్న సినిమా ఏ ప్యాండమిక్ లాంటివి లేకపోతే ఏడాదిన్నరలో వచ్చేస్తుంది అంటూ కామెంట్స్ చేసాడు.
ఇప్పుడు ఇదే ట్విస్ట్ గా మారింది. చరణ్ అలా అన్నాడో లేదో అప్పుడు కరోనా ఏదైతే దేశం నుంచి మొదలైందో ఇపుడు మళ్ళీ చైనాలో కొత్త వైరస్ లు అంటూ పలు వార్తలు షాకింగ్ గా వైరల్ అవ్వడం మొదలు పెట్టాయి. దీనితో మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో రామ్ చరణ్ పై పడ్డారు.

తాను ఇలా అన్నాడో లేదో ఆ మరుసటి నుంచే చైనా నుంచి ఈ వార్తలు రావడం మహేష్ బాబు అభిమానులు ఎన్నో ఏళ్ళు తరబడి ఎదురు చూస్తున్న డ్రీం ప్రాజెక్ట్ కి ఇబ్బందులు కలిగిస్తుందా అంటూ ఇప్పుడు నుంచే గుబులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం చైనాలో పరిస్థితులు కొంచెం సీరియస్ గానే ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
వీటిపై తెలుగు యువత కూడా పలు ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఇదేదో సినిమా రీరిలీజ్ లా మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఈ చైనా వాళ్ళు కొత్త వైరల్ ని తీసుకొస్తున్నారు అంటూ ట్రోల్స్ చేసుకుంటున్నారు కానీ మళ్ళీ అలాంటి భయంకర పరిస్థితులు మాత్రం వద్దని అభిమానులు సహా సామాన్య జనం కోరుకుంటున్నారు. మరి ఈసారి విధి ఎక్కడికి తీసుకెళుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











