భార్యాపిల్లలతో ఇదే తొలిసారి.. మీ అందరిలాగే నాక్కూడా! మహేష్ బాబు.. నెట్టింట వైరల్ వీడియో

Recommended Video

Mahesh Babu Sai Surya Developers Tvc

సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన వృత్తి పట్ల ఎంత నిబద్ధతగా ఉంటారో.. తన కుటుంబం పట్ల అంతే బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. సినిమా షూటింగ్ మధ్యలో ఏ మాత్రం గ్యాప్ దొరికినా భార్యాపిల్లలతో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు మాహేష్. అలాంటి ఈ సూపర్ స్టార్ భార్యాపిల్లలతో ఇదే తొలిసారి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

మనోడు హీరో మాత్రమే కాదు.. ఆ లక్షణాలు కూడా!

మనోడు హీరో మాత్రమే కాదు.. ఆ లక్షణాలు కూడా!

మహేష్ బాబు కేవలం హీరో మాత్రమే కాదు. బిజినెస్ మాన్ కూడా. తన వృత్తి అయిన సినిమాలను కంటిన్యూ చేస్తూనే బిజినెస్ రంగంలో తనదైన మార్క్ చూపుతూ వస్తున్నారు మహేష్. ఇలా సినిమాలు, బిజినెస్ బ్యాలెన్స్ చేస్తూ పలు ప్రకటనల ద్వారా కూడా ఆర్ధికంగా ముందుకెళ్తున్నారు సూపర్ స్టార్.

సరికొత్తగా మహేష్.. భార్యాపిల్లలతో పాటు

సరికొత్తగా మహేష్.. భార్యాపిల్లలతో పాటు

తాజాగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రకటనలో నటించిన మహేష్ బాబు.. సరికొత్తగా కనిపించి అభిమానుల్లో నూతనోత్సాహం నింపారు. ఇక ఈ ప్రకటనలో మహేష్ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార కూడా భాగస్వాములు కావడం సూపర్ స్టార్ అభిమానులను కనువిందు చేస్తోంది. తాజాగా ఈ వీడియోను తన ట్విట్టర్ ద్వారా పంచుకున్న మహేష్.. భార్యాపిల్లలతో ఇదే తొలిసారి అని పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు.

మీ అందరిలాగే నాక్కూడా నా ఫ్యామిలీయే..

''మీ ప్రేమతో మీరు నన్ను సూపర్ స్టార్ చేశారు. కానీ నేను కూడా మీలో ఒకడినే. మీ అందరి లాగే నాకు కూడా నా ఫ్యామిలీయే నా లైఫ్ లైన్. నా ఇల్లే నా ప్రపంచం. నా వాళ్ళనుకునే మీ అందరికీ నేనిచ్చే సలహా..'' మహేష్ మాట్లాడుతున్న తీరు ఫిదా చేస్తోంది. మహేష్ సహా నమ్రత, గౌతమ్, సితార అలా నడుస్తూ వస్తుంటే
చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదంటే అతిశయోక్తి కాదు.

మహేష్.. సరిలేరు నీకెవ్వరు

మహేష్.. సరిలేరు నీకెవ్వరు

మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ సినిమా ‘సరిలేరు నీకెవవ్వరు'లో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X