దుబాయ్ లో మహేష్ బాబుతో స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీ.. గౌతమ్ స్టిల్ వైరల్!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకులకు హీరోలకు ఉండే స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కసారి హీరోలకు ఒక దర్శకుడు నచ్చితే అతనికి ఫ్లాప్స్ వచ్చిన కూడా విడిచి పెట్టరు. ఎలాంటి సందర్భంలో అయినా సరే వారి స్నేహాన్ని కోరుకుంటారు. ఇక మహేష్ బాబు ఇండస్ట్రీ ప్రముఖులతో స్నేహం చేసేది చాలా తక్కువ అయినప్పటికీ కొందరిలో మాత్రం చాలా సన్నిహితంగా ఉంటాడు అని అర్థమవుతుంది. ఇక మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో కూడా మహేష్ బాబుకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక ఇటీవల వీరి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ లో సందడి చేయడం విశేషం.

కరోనా కారణంగా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా అంతకు మించి అనేలా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకోసమే దర్శకుడు ఎవరైనా సరే ముందుగా కథ నచ్చితేనే ఒప్పుకుంటున్నాడు. చివరగా సరిలేరు నీకెవ్వరు సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న మహేష్ ఆ తర్వాత సర్కారు వారి పాట తో ప్రేక్షకుల ముందుకు వీలైనంత త్వరగా రావాలని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా ఆ సినిమా వచ్చే ఏడాది వాయిదా పడిన విషయం తెలిసిందే.

వంశీ - మహేష్ కాంబో..
వంశీ పైడిపల్లి మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే కమర్షియల్ గా భిన్నమైన కోణంలో సినిమాలు తెరపైకి తీసుకువచ్చిన వంశీపైడిపల్లి పూర్తి స్థాయిలో అయితే మెప్పించలేకపోయాడు. అల్లరి నరేష్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం పెట్టిన పెట్టుబడిని మాత్రమే వెనక్కి తీసుకు వచ్చింది.

ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినప్పటికీ..
అసలైతే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లితో మరో సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ మహేష్ బాబు దానిపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వంశీపైడిపల్లి విజయ్ ను సెట్ చేసుకున్నాడు. అయితే మహేష్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినప్పటికీ కూడా స్నేహం లో ఎలాంటి మార్పు రాలేదని అర్థమవుతోంది. ఇద్దరూ కూడా ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే లోకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

దుబాయ్ లోనే..
ఇటీవల హీరో మహేష్ బాబు సర్జరీ కారణంగా దుబాయ్ లో రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలకు సంబంధించిన సిట్టింగ్స్ తో పాటు ఫ్యామిలీ లైఫ్ ను కూడా మహేష్ బాబు అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తన టీమ్ తో కలిసి దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. మొత్తానికి ఆ ప్రాజెక్ట్ అయితే సెట్ అయింది. ఇక వంశీ పైడిపల్లి కూడా తన కుటుంబ సభ్యులను తీసుకుని ఇటీవల దుబాయ్ వెళ్ళాడు.

కుటుంబ సభ్యులతో కలిసి..
కాస్త మెల్లగా కోలుకుంటున్న మహేష్ బాబు సరదాగా బుర్జ్ ఖలీఫాలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశాడు. ఇక వంశీపైడిపల్లి తో పాటు అతని భార్య కూతురు ఆధ్య కూడా కనిపించారు. ఇక వీరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా మహేష్ బాబు కొడుకు గౌతమ్ చాలా హైట్ అయినట్లు అనిపిస్తుంది. ఇక ఫొటోలలో కూడా గౌతమ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు.


Click it and Unblock the Notifications











