Guntur Kaaram: సంక్రాంతి మిస్సయితే మరో ప్లాన్ సెట్ చేసిన త్రివిక్రమ్.. సెకండ్ రిలీజ్ డేట్ అదే..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎదో ఒక ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. అసలు మొదట మహేష్ కు కథ చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు కానీ మళ్ళీ ఆ తరువాత మార్పులు చేయమని కండిషన్ పెట్టడంతో త్రివిక్రమ్ కు చాలా సమయం పట్టింది.
అలాగే కొత్త స్క్రిప్ట్ సెట్టయిన తరువాత హ్యాపీగానే షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ మరికొన్ని వారాలకు మహేష్ కు అది కూడా నచ్చలేదు. దీంతో మళ్ళీ కథ మొదటికొచ్చింది. కథ మార్చాలని మరోసారి డిమాండ్ చేయడంతో మహేష్ కోసం మళ్ళీ త్రివిక్రమ్ కొత్త కథను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇక మళ్ళీ హ్యాపీగా కొనసాగుతుంది అనుకున్న సమయంలో మరోసారి పూజా హెగ్డే విషయంలో డౌట్స్ క్రియేట్ అయ్యాయి.

ఆమె పాత్ర అంతగా సెట్ కాలేదు అని మేకింగ్ విధానం కూడా బాగా లేదని మహేష్ అభ్యంతరాలు చెప్పడంతో మళ్ళీ షూట్ క్యాన్సిల్ అయ్యింది. ఇక మొత్తానికి ఇటీవల మరోసారి కొత్త తరహాలో సినిమా షూట్ ను స్టార్ట్ చేశారు. అయితే మొదట సినిమా స్టార్ట్ చేసినప్పుడు 2024 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అనేది అనుమానంగా మారింది.
అయితే మరో డేట్ సెట్ చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నారట. ఒకవేళ సంక్రాంతికి కుదరకపోతే 2024 ఉగాదికి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. త్రివిక్రమ్ అయితే ప్లాన్ ప్రకారం సంక్రాంతిని టార్గెట్ చేశాడు. ఒకవేళ అటు ఇటు అయితే ఉగాది బెస్ట్ టైమ్ అని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. మరి వీరి ప్లాన్ ఎలాంటి యూ టర్న్ తీసుకుంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ను హైదరాబాద్ లో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











