Guntur Kaaram: మరో షాక్ ఇచ్చే న్యూస్.. మళ్ళీ చేంజ్ అవుతున్న త్రివిక్రమ్ స్క్రిప్ట్ ప్లాన్
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గత ఏడాది మేలో అఫీషియల్ గా స్టార్ట్ అయ్యింది. అసలు ఈ కాంబినేషన్లో సినిమా వస్తోంది అనగానే ఫ్యాన్స్ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.
కానీ సినిమా కాలం గడుస్తున్న కొద్దీ ఎవరు ఊహించని విధమైన అనేక రకాల గాసిప్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి మొన్నటి వరకు చేసిన షూట్ మొత్తం క్యాన్సిల్ చేసినట్లు టాక్ వస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏది సవ్యంగా కొనసాగడం లేదు: మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన అతడు, ఖలేజా అంతగా సక్సెస్ కాకపోయినా కూడా ఇప్పుడు రాబోయే సినిమాపై మాత్రం భారీగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. అసలు కానీ గుంటూరు కారం స్టార్ట్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఏది సవ్యంగా కొనసాగడం లేదు. మొదట్లో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. అనంతరం చాలా కారణాల వలన మూవీ ఆలస్యం అవుతూ వస్తోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ స్క్రిప్ట్ విషయంలో అస్సలు సంతృప్తికరంగా లేరంట.

ఆలస్యం చేయడానికి కారణం: ఈ కారణంగా మాటల మాంత్రికుడు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేయడం జరిగినట్లు ప్రచారం నడిచింది. అయితే ఈ విషయంపై ఎలాంటి సమాచారం బయటకి రాలేదు. మహేష్ బాబు ఈ సినిమా ఆలస్యం చేయడానికి కారణం కూడా స్క్రిప్ట్ నచ్చకపోవడమే అని టాక్. సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్ మీద నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారంట.

మరోసారి ఫ్రెష్ స్క్రిప్ట్: అయితే మూడో సారి స్క్రిప్ట్ మొత్తం పూర్తిగా మార్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ముందు షూట్ చేసిన రెండు షెడ్యూల్స్ పక్కన పెట్టేసి మరల ఫ్రెష్ గా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారంట. ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సారి త్రివిక్రమ్ వినిపించిన వెర్షన్ విషయంలో మహేష్ బాబు సంతృప్తి చెందడంతో దీనిపై త్రివిక్రమ్ కసరత్తు మొదలు పెట్టారంట.

హీరోయిన్ ను పక్కన పెట్టేసారా?: ఇక కొత్త స్క్రిప్ట్ ప్రకారం ముందు హీరోయిన్ గా అనుకున్న పూజా హెగ్డే ని పక్కన పెట్టేయడం జరిగిందంట. శ్రీలీల మాత్రమే మెయిన్ హీరోయిన్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే రమ్యకృష్ణ కి సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. జూన్ 25 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారంట.

ఆమెను తొలగిస్తే: పూజా హెగ్డేని ఈ సినిమా నుంచి తొలగిస్తే మాత్రం కచ్చితంగా స్క్రిప్ట్ మొత్తం మార్చినట్లే అనే బలంగా నమ్ముతారు. గతంలో పూజా హెగ్డే, మహేష్ బాబు కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. ఒక వేళ పూజా హెగ్డేని తప్పిస్తే మాత్రం పూర్తిగా ఫ్రెష్ స్క్రిప్ట్ తోనే త్రివిక్రమ్ గుంటూరు కారం చేయబోతున్నాడనేది కన్ఫర్మ్ అవ్వనుంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మాత్రం షూటింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











