Guntur Kaaram: సలార్ రూట్‌లోనే గుంటూరు కారం.. సక్సెస్ దిశగా సూపర్ స్టార్ ప్లానింగ్.. వర్కౌట్ అయ్యేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న తాజా సినిమా గుంటూరు కారం గురించి అందరికీ తెలిసిందే. అతడు, ఖలేజా వంటి సూపర్ డూపర్ హిట్లు కొట్టి ఈ కాంబో.. దాదాపు 13 సంవత్సరాల తర్వాత మరోసారి జతకట్టారు. ఈ రెండు చిత్రాలకు మించి ఈ సినిమాను తీసుకు వచ్చేందుకు చాలానే కష్టపడుతున్నారు. ఎలాగైనా ఈసారి హిట్టు కొట్టాలనే తీవ్రమైన కసితో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా తెరకెక్కించారట. కేవలం మేకింగ్ లోనే కాకుండా థియేటర్లలో విడుదల అయ్యే తీరులోనే అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమాను ఫాలో అవుతున్నారు. అయితే ఏ విషయంలో మిల్క్ బాయ్.. సలార్ ను ఫాలో అవుతున్నారు, అసలు ఎందుకు ఫాలో అవుతున్నారు.. ఈ ప్లానింగ్ తోనైనా బాక్సాఫీసును షేక్ చేయగలరా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించబోతున్నారు. అలాగే ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ వంటి స్టార్ నటీనటులు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.

Mahesh Babu Guntur Kaaram Movie First Day First Show Details Here

శ్రీమతి మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మిల్క్ బాయ్ మహేష్ పూర్తి మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. లుంగీ కట్టుకుని, బీడీ తాగుతూ రచ్చే చేయబోతున్నారు. ఇప్పటి వరకు విడుదల అయిన టీజర్, పోస్టర్ లు, పాటలు చూస్తుంటేనే ఆ విషయం అర్థం అయిపోతుంది. పూర్తిస్థాయిలో మాస్ లుక్ లో కనిపిస్తూ వస్తున్న ఈ సినిమా.. సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 12వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ లో సలార్ సినిమాను ఫాలో అవుతున్నారు.

Mahesh Babu Guntur Kaaram Movie First Day First Show Details Here

సాధారణంగా అయితే ఏ సినిమా అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో మార్నింగ్ ఉంటుంది. కానీ ఈ సినిమాకు మాత్రం సలార్ లాగే అర్ధరాత్రి ఒంటి గంటలకు షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. కచ్చితంగా ఇదే వర్కౌట్ అయ్యేలా చేస్తున్నారని సమాచారం. ఒకవేళ ఇది కుదరకపోతే గనుక ఉదయం నాలుగు గంటలకు అయినా షో పడాలని భావిస్తున్నారట. సలార్ కూడా ఇలాగే విడుదల అయి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. మరి మహేష్ బాబు గుంటూరు కారం ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Mahesh Babu Guntur Kaaram Movie First Day First Show Details Here

ఇదంతా ఇలా ఉండగా అమెరికాలో కూడా ఈ సినిమా జనవరి 12వ తేదీనే గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే అక్కడ మాత్రం అర్ధరాత్రి 12.30 గంటలకు ఫస్ట్ డే ఫస్ట్ షో పడబోతుంది. ఇలా బెనిఫిట్ షోలు వేయడం వల్ల సినిమాకు బాగానే ప్లస్ అవుతుందని కొంత మంది చెబుతుండగా... మరికొంత మంది మైనస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని అంటున్నారు. మరి మహేష్ బాబు సినిమా బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు రాబట్టి హిట్టు కాంబోకో హ్యాట్రిక్ ఇస్తుందా లేదా అని తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X