Guntur Kaaram: గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్, ఎప్పుడు, ఎక్కడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్న తాజా చిత్రం గుంటూరు కారం గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ హిట్టు సినిమాల తర్వాత.. ముఖ్యంగా పదమూడేళ్ల తర్వాత మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఈ సినిమా రాబోతుంది. వీరిద్దరి క్రేజీ కాంబోలో సినిమా రాబోతుందని తెలిసనప్పటి నుంచి ప్రేక్షకులు తెగ ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఎప్పుడు, ఎక్కడ చేయబోతున్నారో మనం ఇప్పుడు తెలుసకుందాం.
శ్రీమతి మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ గుంటూరు కారం చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించబోతున్నారు. అలాగే ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ వంటి స్టార్ నటీనటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పాటలు, ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యాయి. వీటికి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ట్రైలర్ తో పాటు కుర్చి మడత పెట్టి సాంగ్ కు అయితే ఎవరూ ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఈ రెండు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా మరి ఇంకే రేంజ్ లో ఆడుతుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

మరో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు గుంటూరు కారం చిత్ర బృందం. అయితే గుంటూరులో ఎక్కువ శాతం షూటింగ్ చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గుంటూరులోనే నిర్వహించబోతున్నారు. జనవరి 9వ తేదీ అంటే రేపే సాయంత్రం ఈ వేడకను చేసుకోబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్రారంభించబోతున్నారు. గుంటూరులోని నంబూర్ ఎక్స్ రోడ్స్ వద్ద భారతి పెట్రోల్ బంక్ పక్కన నిర్వహించబోతున్నారు. గుంటూరు ప్రజలంతా ఈ వేడకకు వెళ్లి మహేష్ బాబును నేరుగా చూడచ్చు.


Click it and Unblock the Notifications











