Hanuman Vs Guntur Kaaram తెలంగాణలో హనుమాన్ టిక్కెట్ రేట్లు ఇవే.. గుంటూరు కారంతో పోల్చితే..!

ఈ పండక్కి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. అయితే అందులో మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఒకటి కాగా.. దానికి పోటీగా ప్రశాంత్ వర్మ తేజ సజ్జా నటించిన హనుమాన్ కూడా రాబోతుంది. ఇక ఈ రెండు సినిమాలు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ రెండు సినిమాల టిక్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

తెలుగు వారికి పెద్ద పండగల్లో ఒకటి సంక్రాంతి రెండు దసరా. ఇక దసరా ముగిసింది. సంక్రాంతి పండుగ రాబోతుంది. అయితే పెద్ద సినిమాలు అన్ని ఈ పండక్కి రిలీజ్ కాబోతున్నాయి. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాకు పోటీగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో తేజ సజ్జా నటించిన చిత్రం హనుమాన్. ఇక ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ బరిలో జనవరి 12న దిగనున్నాయి.

Mahesh Babu Guntur Kaaram Prashanth Varma Teja Sajja Hanuman Ticket Prices in Telangana Full Details Here

అయితే ఈ రెండు సినిమాల టిక్కెట్ ధరలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే గుంటూరు కారం టికెట్ ధరలు ఫిక్స్ అయ్యాయి. పెద్ద సినిమాలకు టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుందనే విషయం తెలిసిందే. అయితే మహేశ్ నటించిన గుంటూరు కారం సినిమాకు తెలంగాణలో మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్‌పై రూ. 100 పెంచారు. ఇకు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 50 పెంచారు. మొత్తంగా మల్టీప్లెక్స్ లో గుంటూరు కారం సినిమా టిక్కెట్ రేటు రూ.403గా నిర్ణయించారు.

ఇక ఈ ధర ఆర్ఆర్ఆర్ సినిమా కంటే తక్కువే. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమా టిక్కెట్ ధర 210 రూపాయలు గా ఉంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుపుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టిక్కెట్ ధరలు పెంచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా గుంటూరు కారం సినిమా టిక్కెట్ ధరలు బయటకు వచ్చాయి. గుంటూరు కారం సినిమాతో పోల్చితే తక్కువే అని చెప్పవచ్చు.

Mahesh Babu Guntur Kaaram Prashanth Varma Teja Sajja Hanuman Ticket Prices in Telangana Full Details Here

తెలంగాణలో హనుమాన్ టిక్కెట్ ధరలు మల్టీ ప్లేక్స్ లో రూ.295గా నిర్ణయించగా... సింగిల్ స్క్రీన్స్ లో రూ.110 రూపాయలు గా నిర్ణయించారు. ఇక హైదరాబాద్ సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం రూ.150 గా నిర్ణయించారు. అయితే వీటికి ఇంకా జీఎస్టీ కూడా పడనుంది. ఈ ధరలు గుంటూరు కారం సినిమాతో పోల్చితే తక్కువే అని చెప్పవచ్చు. మరి ఈ ధరలతో ఈ సినిమా ఏమేరకు వసూళ్లు రాబట్టనుందో చూడాలి.

గుంటూరు కారం సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. తమన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాకు పోటీగా వస్తున్న హనుమాన్ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా... వరలక్ష్మి, వినయ్ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది. ఇక ఈ రెండు సినిమాల్లో ఏది సూపర్ హిట్ కానుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X