మహేశ్ బాబు కెరీర్ లోనే చెత్త సినిమా.. 9 ఏళ్లకు తప్పు ఒప్పుకున్న డైరెక్టర్.. ఎవరంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎంత పెద్ద భారీ చిత్రాల్లో నటిస్తున్నారు తెలిసింది. చివరిగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, పంటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం చిత్రంలో నటించి అలరించారు. మాస్ అప్పియరెన్స్ తో తన అభిమానులను ఫుల్ కృషి చేశారు. ఇకపై మహేష్ బాబు చాలా డిఫరెంట్ చిత్రాల్లో నటించబోతున్నానని కూడా ఆ మూవీ రిలీజ్ సందర్భంలో చెప్పారు. అందుకే తన అభిమానుల కోసం ఊర మాస్ లుక్, థియేటర్ దద్దరిల్లిపోయేలా స్టెప్పులు వేశానని కూడా చెప్పుకొచ్చారు. ఇక మహేష్ బాబు చిత్రాల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరోవైపు మహేష్ బాబు కూడా తన అభిమానులను ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా తన సినిమాలను ఎంపిక చేస్తూ ఉంటారు. మొదటి నుంచి మహేష్ బాబు స్టార్ డైరెక్టర్లతోనే కలిసి పని చేశారు. బ్లాక్ బస్టర్ హిట్టులను తన కెరియర్లో చూశారు. అయితే ఇదే సమయంలో మహేష్ బాబు కొన్ని చిత్రాలతో ప్రయోగాలు కూడా చేశారు. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేయడానికి ప్రయత్నించారు. అయితే అలా వచ్చిన చిత్రాలు చాలావరకు సక్సెస్ ను అందుకున్నాయి. దాంతో మహేష్ బాబు స్టోరీ సెలక్షన్స్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో అర్థం అవుతుంది.

అయినప్పటికీ మహేష్ బాబు కెరియర్ మొత్తంలో అభిమానులు కూడా అస్సలు ఒప్పుకొని చిత్రం 'బ్రహ్మోత్సవం' అని ప్రచారం ఉంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబును కొత్త బంగారులోకం చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2016 లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాయింట్ ఫ్యామిలీ పై వచ్చిన ఈ మెలోడీ డ్రామాలో భారీ తారాగణం నటించింది. కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు, రేవతి, సత్య రాజ్, ప్రణిత సుభాష్, ప్రకాష్ రాజ్, జయసుధ, కేజీఎఫ్ ఈశ్వరి రావు, చంద్రమోహన్, నరేష్, ప్రియదర్శి... వంటి ప్రముఖులు కీలక పాత్రలను పోషించారు.
అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం పొందింది. ప్రేక్షకుల నుంచి, ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి ఊహించిన విధంగా విమర్శలు అందుకుంది. 70 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద కూడా 63 కోట్లు మాత్రమే తిరిగి రాబట్టగలిగింది. అయితే మహేష్ బాబు సినిమాకు ఇలాంటి కలెక్షన్లు, ఆడియోస్ నుంచి కూడా విపరీతమైన నెగటివ్ రెస్పాన్స్ రావడం షాక్ ఇచ్చింది. హలో మహేష్ బాబు కెరీర్ లోనే బ్రహ్మోత్సవo భారీ డిజాస్టర్ ఫిల్మ్ గా మిగిలింది. అప్పట్లో సినిమా వైఫల్యంపై పెద్ద చర్చనే నడిచింది.
అయితే బ్రహ్మోత్సవం మూవీ ఘోర పరాజయం చెందడానికి అసలు కారణాన్ని తాజాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలియజేశాడు. 100% తాము ఎంచుకున్న స్క్రిప్ట్ వల్లనే సినిమా ఫ్లాప్ అయిందని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రానికి కథను రాసుకుంది కూడా శ్రీకాంత్ అడ్డాలనే కావడంతో తప్పు తనదేనని ఒప్పుకున్నట్టుగా అర్థమవుతుంది. అయితే సినిమా రిలీజ్ ఇప్పటికి 9 ఏళ్ళు అయ్యింది. అటు శ్రీకాంత్ అడ్డాల కెరియర్ లోను బ్రహ్మోత్సవం చిత్రమే భారీ దెబ్బ కొట్టింది. ఇక అంతకు ముందు మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ చేసుకుంది. ఈ చిత్రం ఇటీవల రీ రిలీజ్ కూడా అయి సందడి చేసింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎస్ఎస్ఎంబీ 29 చిత్రంలో నటిస్తున్నారు. ఇక శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం చిత్రం ఫ్లాఫ్ అవడంతో అయిదేళ్ల గ్యాప్ తీసుకొని చివరిగా నారప్ప, పెద్దకాపు 1 చిత్రాలను డైరెక్ట్ చేసి విడుదల చేశారు. ఏప్రిల్ మరో క్రేజీ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు.


Click it and Unblock the Notifications











