మహేష్ బాబు మళ్లీ జంప్... ఈ సారి 20 రోజులు!
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు... అసలు ఇండియన్ సినీ పరిశ్రమలోనే మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ వెకేషన్ ఎంజాయ్ చేసినట్లుగా ఏ స్టార్ ఫ్యామిలీ వరుస టూర్లు వేయరేమో! 'మహర్షి' సినిమా విడుదలకు వారం రోజుల ముందే మహేష్ తన కుటుంబంతో కలిసి పారిస్ వెకేషన్ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.
'మహర్షి' సినిమా విడుదలై పది రోజులు గడిచిందో లేదో... మహేష్ తన కుటుంబంతో మళ్లీ విదేశాలకు వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ విషయం వెల్లడిస్తూ 'మరొక మెమొరబుల్ హాలిడే వెళుతున్నాం. ఇది చాలా స్పెషల్. మహర్షి సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటూ వెళుతున్నాం' అంటూ ట్వీట్ చేశారు.

'మహర్షి' విడుదలై 11 రోజులు గడిచింది. మంచి వసూళ్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లందరికీ లాభాలు ఖాయం అని తేలిపోయింది. దీంతో మరింత హ్యాపీగా మహేష్ బాబు సెకండ్ టూర్ వెళుతున్నారు.
సూపర్ స్టార్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఈ సారి వీరు 20 రోజుల పాటు యూరఫ్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారని తెలుస్తోంది. జూన్ 10 తర్వాత వారు తిరిగి హైదరాబాద్ రీచ్ అవుతారట.
యూరఫ్ టూర్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మహేష్ తన తర్వాతి సినిమా షూటింగులో బిజీ కాబోతున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసందే. అనిల్ సుంకర ఎకె ఎంర్టెన్మెంట్స్ బేనర్లో ఈ మూవీ నిర్మించబోతున్నారు.


Click it and Unblock the Notifications











